
`ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కృతి శెట్టి. తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకుంది. `ఉప్పెన` విజయం ఇండస్ట్రీకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. కరోనా అనంతరం ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన చిత్రం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. అంతా కొత్తవాళ్లు కలిసి సంచలనం సృష్టించారు.
ఈ సినిమా విడుదలకు ముందే పాపులర్ అయ్యింది కృతి శెట్టి. ఆమె పాటల్లో మెరిసినప్పుడు కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆ క్యూట్ లుక్స్ తో మంత్రముగ్దుల్ని చేసింది. సాంగ్స్ లో ఆమె అందాలు, ఎక్స్ ప్రెషన్స్ హైలైట్‌గా నిలిచాయి. దీంతో కుర్రాళ్లు మొత్తం ఆమెకి పడిపోయారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక అభిమానులుగా మారిపోయారు. తొలి చిత్రంతోనే అద్భుతంగా చేసి మెప్పించింది.
కృతి శెట్టి బోర్న్ విత్ స్టార్ అన్నట్టుగా, ఆమె స్టార్‌గానే పుట్టింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే హిట్ కావడం, స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ దాన్ని నిలుపుకోవడంలో, దాన్ని మెయింటేన్ చేయడంలో తడబడింది. సడెన్‌గా వచ్చిన క్రేజ్, ఇమేజ్, పాపులారిటీతో రాంగ్ నిర్ణయాలు తీసుకుంది. సరైన స్క్రిప్ట్ లను ఎంచుకోలేకపోయింది.
కొత్తలో అవకాశాలు రావడమే గొప్ప అనే ఫీలింగ్‌లో ఉంటారు. యంగ్ స్టార్స్ తో అంటే మరో మాట లేకుండా ఓకే చెబుతుంటారు. కృతి శెట్టి అదే చేసింది. దీంతో అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. నానితో చేసిన `శ్యామ్ సింగరాయ్`, నాగచైతన్యతో చేసిన `బంగార్రాజు` మూవీస్ ఫర్వాలేదు. కానీ రామ్‌తో చేసిన `ది వారియర్స్`, నితిన్‌తో చేసిన `మాచెర్ల నియోజకవర్గం`, సుధీర్‌బాబుతో కలిసి నటించిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, చైతూతో మరోసారి నటించిన `కస్టడీ` చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లుగా మిగిలాయి.
దీంతో ఒక్కసారిగా తెలుగులో ఖాళీ అయ్యిది కృతి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఆఫర్లు లేవు. దీంతో మలయాళం, కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ ఒక్కో సినిమా చేస్తుంది. టాలీవుడ్‌లో ఆఫర్లు రావడం లేదా? తనే ఆచితూచి ఎంపిక చేసుకుంటుందా? తెలియదు కానీ ఈ అమ్మడు కొత్తగా మరే తెలుగు మూవీని ప్రకటించకపోవడం గమనార్హం.
అయితే ఇప్పటి వరకు కాస్త హోమ్లీ బ్యూటీగానే మెరిసిన కృతి శెట్టి ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచుతుంది. హాట్‌గా పోజులిస్తూ షాకిస్తుంది. అందాల విందులో అలరిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. అదే సమయంలో మేకర్స్ హింట్ ఇస్తుంది. కమర్షియల్ హీరోయిన్‌గా, కమర్షియల్ చిత్రాలు చేసేందుకు తాను సిద్ధమే అనే సాంకేతాలను పంపిస్తుంది.
అందులో భాగంగా ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. బ్లాక్ టీషర్ట్ ధరించి పిచ్చెక్కించే పోజులిచ్చింది. క్లోజప్‌లో కిల్లర్ లేడీలా మారిపోయింది. మత్తెక్కించే చూపులతో టెంప్ట్ చేస్తుంది. కృతి శెట్టి కసి చూపులకు కుర్రాళ్ల బేజారెత్తిపోతున్నారు. దీనిపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కి్లలర్ లుక్స్ తో కరెంట్‌షాక్ కొడుతుందని అంటున్నారు. బాబోయ్ బేబమ్మలో ఇంత ఘాటు ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి తన అందాలతో మేకర్స్ కి ఎరవేస్తుంది కృతి శెట్టి. మరి వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. కానీ ఇకపై మాత్రం తాను ఆచితూచి సినిమాలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పటి వరకు మరే తెలుగు సినిమాకి సైన్ చేయలేదని టాక్.