ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. `అన్‌ప్లగ్గుడ్ శుభాంకర్`కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక `కెరటం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ నటి రకుల్ తెలుగులో `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`తో విజయాన్ని అందుకుంది. వరుసగా `రఫ్`, `లౌక్యం`, `కరెంట్ తీగ`, `పండగ చేస్కో`, `కిక్ 2`, `బ్రూస్ లీ`, `నాన్నకు ప్రేమతో`, `సరైనోడు`, `ధృవ`, `విన్నర్`, `రారండోయ్ వేడుక చూద్దాం`, `జయ జానకి నాయక`, `స్పైడర్`, `మన్మథుడు 2`, `చెక్`, `కొండపొలం` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో `దే దే ప్యార్ దే 2`లో అజయ్ దేవగన్‌కి జోడీగా చేస్తుంది రకుల్.