తెలుగు తెరపై మలయాళ మంత్రం.. హిట్ కొడుతున్న రీమేక్ కథలు..

Published : Mar 02, 2022, 09:43 AM IST

మలయాళ ఫిల్మఇప్పుడు హిట్ కథల ఫ్యాక్టరీగా మారిపోయింది.  అవ్వడానికి చిన్న ఫిల్మ్  ఇండస్ట్రీ అయినా పెద్ద సక్సెస్ లు కొడుతూ... ఇతర పరిశ్రమలకు కథలు అందిస్తుంది.  మళయాళ రీమేక్ లతో టాలీవుడ్ మేకర్స్ వరుసగా సక్సెస్ లు కొడుతున్నారు.

PREV
110
తెలుగు తెరపై మలయాళ మంత్రం.. హిట్ కొడుతున్న రీమేక్ కథలు..

మళయాళ సినిమాలు మనకు బాగా కలిసొస్తున్నాయి. అక్కడ నుంచి అరువు తెచ్చుకుని మన స్టార్ హీరోలు తెరకెక్కించిన రీమేక్ సినిమాలు అదిరిపోయే సక్సెస్ అవుతున్నాయి. కలిసొచ్చిన మళయాళ రీమేక్స్ తో   వరస పెట్టి సూపర్ హిట్లు కొడుతున్నారు మన స్టార్ హీరోలు. ఇంకా మంచి మలయాళ కథల కోసం వేటాడుతూనే ఉన్నారు.

210

మలయాళ సినిమాలకు ఇంప్రెస్ అయిపోయిన టాలీవుడ్  అక్కడి  సినిమాల్ని వరుస పెట్టి రీమేక్ చేస్తోంది.  పవన్ కళ్యాణ్(Pawan Kalyan) -రానా(Rana) కాంబినేషన్లో  లేటెస్ట్ గా రిలీజ్ అయిన మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్  భీమ్లా నాయక్ రికార్డులు బద్దలుకొడుతోంది. మళయాళంలో పృథ్విరాజ్, బిజు మీనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన  అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన భీమ్లానాయక్ .. పవన్ కళ్యాణ్ సక్సెస్ స్టామినా ని మరో సారి ప్రూవ్ చేసింది.

310

తమ్ముడు కంటే ముందే ..మళయాళ రీమేక్ మూవీని లైన్లో పెట్టారు అన్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). మళయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్  పొలిటికల్ ఎంటర్ టైనర్ లూసిఫర్  ని మోహన్ రాజా తో రీమేక్  చేస్తున్నారు చిరంజీవి. గాడ్ ఫాదర్ టైటిల్ తో పర్ ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ మళ యాళ రీమేక్ పై ఇప్పటికే విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

410

మలయాళ మంత్రం టాలీవుడ్ లో బాగా పనిచేస్తుండటంతో మెగా ఫ్యామిలీ మలయాళ హిట్ సినిమాలపై కన్నేశారు. మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రైట్స్ ను తీసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ అయిన చరణ్.. ఈ మలయాళ రీమేక్ ను టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరితో నిర్మించాలని చూస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

510

అంతకుముందు కూడా తెలుగు హీరోలు  మళయాళం రీమేక్స్ తో మంచి హిట్స్ అందుకున్నారు. టాలీవుడ్ లో ఎక్స్ పెరిమెంట్స్  చెయ్యడానికి ఎప్పుడూ రెడీ గా ఉంటే వెంకటేష్ (Venkatesh) కూడా కంటెంట్ నచ్చితే భాషతో సంబందం లేకుండా రీమేక్ చేస్తారు. టాలీవుడ్ రీమేక్ రారాజుగా ఆయనకు పేరుంది. అలా మోహన్ లాల్ (Mohan Laa) నటించిన మళయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 ని జస్ట్ 45 రోజుల్లోనే కంప్లీట్ చేసేసి ఓటీటీ లోరిలీజ్ చేశారు. ఓటీటీ లో రిలీజ్ అయినా కూడా ఫస్ట్ పార్ట్ ని మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది దృశ్యం 2. 

 

610

ఇక టాలీవుడ్ యంగ్ స్టార్.. మాస్ కా దాస్ అంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న విష్వక్ సేన్ కి ఆరేంజ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది మళయాళ రీమేక్ మూవీయే. అంగమలై డైరీస్ అనే మళయాళ సినిమాని ఫలక్ నుమా దాస్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి కెరీర్ లో మంచి హిట్ అందుకున్నాడు విష్వక్ సేన్.

 

710

వీటితో పాటు యంగ్ హీరో సత్యదేవ్( Satya Dev) కి కెరీర్ లోలిఫ్ట్ ఇచ్చిన సినిమా  ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.  మహేషింతే ప్రతీకారం టైటిల్ తో మళయాళం లో సూపర్ హిట్ అయిన సినిమాని సత్యదేవ్ హీరోగా తెలుగులో కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ చేసి మంచి హిట్ అందుకున్నారు.  

810

రీసెంట్ గా మళయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ఆండ్రాయిడ్ కుంజప్పన్ వర్షన్ 5.25. ఈ కామెడీకి సెంటి మెంట్ ని యాడ్ చేసి తండ్రీ కొడుకుల రిలేషన్ ని చాలా రియల్ గా చూపించిన ఈ సినిమా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది.  ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీని  లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లోనే మోహన్ బాబు (Mohan Babu) రీమేక్ చేస్తున్నారు.

910

అంతే కాదు మళయాళం మరో సూపర్ హిట్ అయిన కప్పెళ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ రీమేక్ చేస్తోంది. యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ( Siddhu Jonnalagadda) , అర్జున్ దాస్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శౌరి చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. 

1010

ఈ సినిమాలతో పాటు హెలెన్ అనే మరో  విమెన్ సెంట్రిక్ మళయాళ థ్రిల్లర్ మూవీని అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో రీమేక్ చెయ్యడానికి పీవీపీ ప్లాన్స్ రెడీ చేస్తోంది. ఇలా వరసగా హిట్లు ఇస్తూ..కలిసొస్తున్న మళయాళ సినిమాల్ని రీమేక్ చెయ్యడానిక తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మన స్టార్లు .

Read more Photos on
click me!

Recommended Stories