అతడి గుట్టు బయటపడ్డాక నా హార్ట్ బ్రేక్ అయింది.. కాళ్ళ మీద పడి వేడుకున్నా, రాఖీ సావంత్ సంచలనం

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 15, 2022, 01:18 PM IST

ఒకవైపు వాలెంటైన్స్ డే సంబరాలు జరుగుతుండగా రాఖీ సావంత్ ఊహించని షాక్ ఇచ్చింది. బాంబు లాంటి చేదు వార్తని ప్రకటించింది. తాను తన భర్త రితేష్ తో విడిపోతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

PREV
16
అతడి గుట్టు బయటపడ్డాక నా హార్ట్ బ్రేక్ అయింది.. కాళ్ళ మీద పడి వేడుకున్నా, రాఖీ సావంత్ సంచలనం

ఒకవైపు వాలెంటైన్స్ డే సంబరాలు జరుగుతుండగా రాఖీ సావంత్ ఊహించని షాక్ ఇచ్చింది. బాంబు లాంటి చేదు వార్తని ప్రకటించింది. తాను తన భర్త రితేష్ తో విడిపోతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. రాఖి సావంత్, రితేష్ ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

26

బహిరంగంగానే ఇద్దరూ లిప్ కిస్సులు ఇచ్చుకునేంత ప్రేమ చూపించారు. కానీ ఇంతలో ఏమైంది / రాఖీ, రితేష్ దంపతులు ఎందుకు విడిపోతున్నారు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. నిన్న విడిపోతున్నట్లు ప్రకటించిన రాఖీ సావంత్ తాజాగా తమ విడాకులకు గల కారణాలని బయటపెట్టింది. 

36

'నాకు బిగ్ బాస్ 15 తర్వాతే అసలు విషయం తెలిసింది. బిగ్ బాస్ తర్వాత రితేష్ నాతో గడిపింది చాలా తక్కువ. కానీ నేను అతడితో గడిపేందుకు చాలా ట్రై చేశాను. కానీ అవాయిడ్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిసేవరకు ఓపిక పట్టాడు. ఎందుకంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హాజరు కాకుంటే అగ్రిమెంట్ ప్రకారం రూ. 2 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. 

46

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే వరకు నాకు తెలియదు. అతడికి ఆల్రెడీ పెళ్లయింది అనే విషయం. ఒక కొడుకు కూడా ఉన్నాడు. మరీ దారుణం ఏంటంటే.. రితేష్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మా ఇద్దరి వివాహం చట్టబద్ధంగా చెల్లదు అని రాఖీ సావంత్ వాపోయింది. ఈ విషయం తెలిశాక నా హృదయం ముక్కలయింది. 

56

కానీ నన్ను విడిచి వెళ్లోద్దని అతడి కాళ్ళమీద పడి వేడుకున్నా. అయినా వినలేదు. ఈ ఏడాది పిల్లల్ని కనాలని కూడా ప్లాన్ చేసుకున్నా. నా ఆశలన్నీ ఆవిరయ్యాయి అంటూ రాఖీ సావంత్ భావోద్వేగానికి గురైంది. బిగ్ బాస్ తర్వాత రితేష్ కనీసం నాకు ముద్దు కూడా ఇవ్వలేదు. నేనే అతడికి ముద్దు పెట్టేదాన్ని అని రాఖి సావంత్ చెప్పుకొచ్చింది. 

66

ఒక వేళ రితేష్ తిరిగి నాతో జీవించాలనుకుంటే అతడికి సొంతంగా ఇల్లు, కారు ఉండాలని రాఖీ సావంత్ కండిషన్ పెట్టింది. తన మొదటి భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో రితేష్ రాఖి సావంత్ తో బ్రేకప్ చేసుకున్నాడని అంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం రాఖి సావంత్ మానసిక వేదన అనుభవిస్తోంది అనేది మాత్రం వాస్తవం. 

click me!

Recommended Stories