Intinti Gruhalakshmi: నిజం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న దివ్య.. విజయ గర్వంతో రాజ్యలక్ష్మి!

Published : May 02, 2023, 09:12 AM IST

Intinti Gruhalakshmi : స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంది. సవతి కొడుకు ఆస్తి కోసం కుట్రలు పన్నుతున్న ఒక సంవత్సరం కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.   

PREV
18
Intinti Gruhalakshmi: నిజం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న దివ్య.. విజయ గర్వంతో రాజ్యలక్ష్మి!

 ఎపిసోడ్ ప్రారంభంలో శోభనానికి దివ్య తయారయ్యి కూర్చుంటుంది. పక్కనే ఉన్న అనసూయతో నానమ్మ.. నీకు చాలా అనుభవం ఉన్నది కదా ఇలాంటి సమయంలో నాకు ఏవైనా ముందుమాటలు చెప్పొచ్చు కదా అంటుంది దివ్య. తెలిసీ తెలియని వయసులో నాకు పెళ్లి చేసేసారు అందుకే నాకు ఏమీ తెలియదు కావాలంటే ప్రియని అడుగు అని అంటుంది అనసూయ. అప్పుడు ప్రియ నాకూ ఏం తెలీదు అని అంటుంది.
 

28

ఇంతలో తులసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు హనీమూన్ కి ఎక్కడికి వెళ్లావు అని దివ్య అడగగా నేను ఈ ఇంటికి రావడమే నా అదృష్టం అనుకుంటున్నాను. నా గురించి తర్వాత గాని నువ్వు రెడీ అవ్వు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది ప్రియ. అనుమానంగా మొఖం పెడుతుంది దివ్య. ఆ తర్వాత సీన్లో విక్రమ్ ని అందరూ తయారు చేస్తూ ఉంటారు.
 

38

 ఇంతలో విక్రమ్ వాళ్ళ తాతయ్య నాకు పెళ్లయిన సంవత్సరానికి కొడుకు పుడితే వాడికి పెళ్లయిన 10 నెలలకే నన్ను తాతని చేశాడు నువ్వు ఆ రికార్డుని తిరగ రాయాలి అంటూ ఆటపట్టిస్తాడు. అలాగే అని అంటాడు విక్రమ్. నందు మౌనంగా ఉండడం చూసి ఎందుకు మావయ్య మౌనంగా ఉన్నారు అని విక్రమ్ అడుగుతాడు. నా కూతురు పెళ్లి అయ్యాక ఎలాంటి ఇంట్లో ఉంటుందా అని భయపడే వాడిని కానీ ఇప్పుడు ఆ భయం లేదు అంటాడు నందు.
 

48

నా గుండెల్లో పెట్టి దివ్యని చూసుకుంటాను మీకు ఎలాంటి భయం అక్కర్లేదు అంటాడు విక్రమ్. ఆ మాటలకి  నందు ఆనందపడతాడు. ఆ తర్వాత సీన్లో అందరూ హాల్లో కూర్చుని నీళ్ల  బిందెలో  ఉంగరం వేసి దివ్య గెలిస్తే తులసి గెలిచినట్టు, విక్రమ్ గెలిస్తే వాళ్ళ అమ్మ గెలిచినట్టు అని అంటారు. నందు బిందెలో వేయడానికి తులసికి ఉంగరం ఇస్తాడు.
 

58

 నందు, దివ్య మీద కాకుండా తులసి మీద ప్రేమ తో ఇస్తున్నట్టుంది ఈ ఉంగరం. అయినా జరగని శోభనానికి ఇన్ని సోకులు ఎందుకు అనుకుంటుంది లాస్య.ఇంతలో ఉంగరం విక్రమ్ కి దొరికినా కూడా దివ్య చేతిలో పెట్టడంతో దివ్య గెలుస్తుంది. అప్పుడు తులసి అందరి ముందు నీ భార్య ఓడిపోకూడదు అని నువ్వు చేసిన త్యాగం గొప్పది కనుక ఈ పోటీలో ఇద్దరు గెలిచారు అంటుంది.
 

68

అమ్మ పేరు చెప్పినా సరే దివ్యకి ఉంగరం ఇచ్చాడు అంటే మా ఇద్దరి మధ్య బంధం తగ్గుతుంది అని అనుకుంటుంది రాజ్యలక్ష్మి. తర్వాత సీన్లో బంతాట  ఆడుతూ ఉంటారు కొత్త దంపతులు. ఇంతలో లాస్య అదేంటి ముహూర్తం దగ్గరికి వస్తుంది ఇంకా శోభనం ఆపే ప్లాన్ వెయ్యలేదు అని మనసులో అనుకొని కంగారు పడుతూ ఉంటుంది. దివ్య, విక్రమ్ లు శోభనం గదిలోకి వెళ్తారు.
 

78

చాలా ముద్దుగా ఉన్నావు అని విక్రమ్ అనగా అయితే పెట్టుకో అని దివ్య అంటుంది.మరి నువ్వు ఒప్పుకోవు కదా అంటాడు విక్రమ్. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నీ ఇష్టం అని దివ్య అనగా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ సిగ్గు పడతారు.మరో వైపు కింద తులసి వాళ్ళు మా పని అయిపోయింది ఇంక మేము బయలుదేరుతాము అని బయలుదేరుతూ అంటారు.
 

88

వాళ్ళు గదిలోకి కూడా వెళ్లిపోయారు ఇంకా శోభనం ఆపే ప్రయత్నం జరగట్లేదు అని కంగారుపడుతుంది లాస్య. ఇంతలో రాజ్యలక్ష్మి మెట్ల మీద నుంచి కింద పడిపోయినట్టు నటించి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకి అందరూ వస్తారు గదిలో ఉన్న విక్రమ్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు విక్రమ్ వెనక దివ్య కూడా వస్తుంది. మీరెందుకు వచ్చారు బాబు మేం చూసుకుంటాం కదా మీరు లోపలికి వెళ్ళండి అంటాడు పరంధామయ్య. వద్దు నేను అమ్మతో ఉంటాను. అమ్మ నొప్పితో బాధపడుతుంటే  నేను శోభనం చేసుకోలేను అని విక్రమ్ అంటాడు. తరువాయి భాగంలో శోభనం ఆగిపోయింది అన్నట్టుగా అన్నట్లుగా విజయ గర్వంతో  లాస్యకి సైగలు చేస్తుంది రాజ్యలక్ష్మి. లాస్య ఆనందపడుతుంది.

click me!

Recommended Stories