Prema Entha Madhuram:మదన్ చెంప పగలగొట్టిన అను.. అపరిచితురాలి మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?

Published : May 02, 2023, 07:49 AM IST

Prema Entha Madhuram:జీ తెలుగు లో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులకు హృదయాలని గెలుచుకొని టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. స్వార్థపరురాలైన ఒక పెద్దింటి చిన్న కోడలి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Prema Entha Madhuram:మదన్ చెంప పగలగొట్టిన అను.. అపరిచితురాలి మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?

ఎపిసోడ్ ప్రారంభంలో క్యాలెండర్లో డేట్ చూసి అను ఆశ్చర్య పోతుంది. సర్ ఆరోజు అష్టమి పడింది సార్ వద్దు సార్, డాక్టర్ తో మాట్లాడి మనం డేట్ మార్పించుకుందాము అని చాలా కంగారుపడుతుంది కానీ ఆర్య నువ్వు ఏమీ భయపడొద్దు అను నేను నీ పక్కనే ఉన్నాను కదా బిడ్డ ఇప్పుడే తొమ్మిదో నెలలోకి వచ్చాడు, టెన్షన్ పడకు అని  ధైర్యం చెప్పి పడుకోపెడతాడు.
 

28

ఆ తర్వాత సీన్ లో అను రోడ్డు మీద నడుస్తూ ఉండగా వెనకాతల నుంచి మదన్ కారు దిగి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పే దింపుతాను అని అంటాడు వద్దు అని చెప్పి ఉండగా మతం చేయి పట్టుకుంటాడు కోపంతో అను మదన్ చెంప చెల్లుమనిపిస్తుంది. చెయ్యి పట్టుకున్నంత మాత్రాన కొడతావా అని మాత్రం కోపంగా ఉంటాడు గుడ్ టచ్ కి బ్యాడ్ టచ్ కి తేడా తెలియని పని పిల్లని కాదు నేను.
 

38

 నీ చూపు, నీ మాటలు అన్నీ అర్థమవుతాయి అయినా ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నాను అంటే నీకు అంజలికి మధ్య అన్నా చెల్లెలు సంబంధం పోతుందని, ఇంకోసారి నా జోలికి వస్తే చేతితో కాదు చెప్పుతో కొడతాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది అను. కచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకుంటాను అని అంటాడు మదన్.
 

48

ఆ తర్వాత సీన్లో మాన్సీ సోఫా మీద కూర్చొని పేపర్లో న్యూస్ చూసి ఆశ్చర్య పోతుంది. ఆ పేపర్లో 1300 కోట్లు అప్పు తీర్చలేని ఆర్య వర్ధన్ టెక్స్టైల్స్ ని వేలంపాటి అమ్ముతున్నాడు అని విశ్వసనీయ సమాచారం అని రాసి ఉంటుంది. ఆశ్చర్యపోయిన మాన్సీ,నీరజ్ ని పిలిచి జరిగిన విషయం అడుగుతుంది. అదంతా నిజం కాదు పేపర్ వాళ్ళు ఊరికినే రాస్తున్నారు అంటాడు నీరజ్.
 

58

 ఒకవేళ అదే నిజమైతే ఏం చేస్తావు, రాజనందిని టెక్స్టైల్ కి ఎంత మంచి ఫ్యూచర్ ఉంది, బంగారు గుడ్డు పెట్టే బాతు, ఏదైనా సమస్య ఉంటే ఆయనే తీర్చుకుంటారు గాని కంపెనీ అమ్మడం ఏంటి అని కోపంగా అడుగుతుంది మాన్సీ.అది ఆయన సంపాదించుకున్నది, ఏంచేయాలో ఆయనకు తెలుసు మధ్యలో నువ్వు దూరవద్దు అంటాడు నీరజ్.

68

 అదే జరిగితే నీకు నాకు విడాకులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ.ఆ తర్వాత సీన్లో అదే వార్త చదువుతాడు ఆర్య అప్పుడు జెండే వీళ్ళు మనకన్నా ముందుగా ఆలోచిస్తున్నారు, కోర్టులో ఓడిపోయారని, బయటైనా గెలవాలని ఇలా ప్రచారం చేస్తున్నారు అని అంటాడు. ఇంతలో అంజలి అక్కడికి వస్తుంది.
 

78

 ఆ న్యూస్ చూసి నన్నేమైనా సహాయం చేయమంటారా సర్, మా పెదనాన్న తన రైట్స్ అన్ని నాకే ఇచ్చారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తాను అంటుంది.నాకు ఇష్టం లేదు  అంటాడు ఆర్య. ఇంతలో మదన్ అక్కడికి వచ్చి దారిన పోయే ప్రతి అడుక్కునే వాడికి డబ్బులు ఇస్తానంటే ఊరుకోను పేరు గొప్ప ఊరు దిబ్బ.
 

88

 ఇలాంటి వాళ్లు బయటకు అన్ని ఉన్నట్టే కనిపించినా వీళ్ళి దగ్గర ఉండేది శూన్యం మాత్రమే. వీళ్ళ ఇండస్ట్రీ కూడా ఎప్పుడో ఒకప్పుడు కూలిపోవాల్సిందే  అంటాడు. ఆ మాటలకి అర్యకి అనుకి చాలా కోపం వస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories