సంయుక్తా మీనన్ మంచి మనసు, ఇద్దరు స్టూడెంట్స్ కు ఏంత సాయం చేసిందో తెలుసా..?

Published : May 02, 2023, 07:59 AM IST

అందానికి అందం మాత్రమే కాదు.. మంచి మనసు కూడా  ఉంది అని నిరూపించుకుంది హీరోయిన్ సంయుక్తా మీనన్. ఇద్దరు పేద విద్యార్థినిలకు తను సాధించిన బహుమతిని ఇచ్చేసి.. ఇంకా సాయం కూడా చేసింది. ఇంతకీ సంయుక్తా ఏం చేసింది..? 

PREV
18
సంయుక్తా మీనన్ మంచి మనసు, ఇద్దరు స్టూడెంట్స్ కు ఏంత సాయం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ సంయుక్తా మేనన్. మలమాళంలో రీసెంట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ. కోలీవుడ్ ను దాటుకుని టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది. టాలీవుడ్ లో వరుస ఆఫర్లు సాధిస్తూ.. దూసుకుపోతోంది. 

28

టాలీవుడ్ లో చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో.. సంయుక్తా మీనన్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె ఉంటే సినిమా హిట్టు... లేదంటే యావరేజ్.. కాని ప్లాప్ మాత్రం అవ్వదు అని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అందుకే గొల్డెన్ లేగ్ అన్న పేరు సాధించుకుంది సంయుక్తా. 

38

విరూపాక్ష సినిమాతో తాజాగా హిట్ అందుకుంది సంయుక్తా.. సాయి తేజ్ జోడీగా.. కార్తీక్ దండు దర్శకుడిగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరఅద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈమూవీ సక్సెస్ తో.. బుల్లితెర ప్రోగ్రామ్ సిక్త్స్ సెన్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారు టీమ్. ఓంకార్ హోస్ట్ గా ఉన్న షోలో వీరు సందడి చేశారు. 

48

ఈ షోలో  అన్ని టాస్క్‌లు గెలిస్తే స్కూటీ ఇస్తామని హోస్ట్  ఓంకార్‌ అనౌన్స్ చేయగా.. విరూపాక్ష టీమ్‌ మాత్రం తాము  ఆ స్కూటీని గెలిస్తే అక్కడున్న స్టూడెంట్స్‌లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం అని అన్నారు.  అనుకున్నట్టుగానే ఆ గేమ్ ను హీరోయిన సంయుక్తా గెలిచి చూపించింది. దాంతో తాను గెలుచుకున్న స్కూటీని.. సంయుక్త మీనన్‌ అక్కడున్న స్టూడెంట్స్‌లో ఇద్దరిని సెలక్ట్‌ చేసి అందులో ఒకరికి ఆ స్కూటీని ఇచ్చేసింది. 

58

అంతే కాదు అక్కడ ఉన్న మరో అమ్మాయికి కూడా తాను స్వయంగా స్కూటీ కొనిస్తానని మాట ఇచ్చింది సంయుక్తా మీనన్. ఇక సంయుక్తా మంచి మనసుకు.. ఇద్దరు విద్యార్ధునులు  హగ్‌ చేసుకుని థాంక్స్ కూడా చెప్పారు. ఇక ఇది చూసిన నెటిజన్లు .. బ్యూటీ విత్‌ గోల్డెన్  హార్ట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

68

టావుడ్ లో సంయుక్తా మీనన్ చాలా స్పెషల్ అనిపించుకుంటుంది. మంచిమనసు చాటుకుంటుంది. రీసెంట్ గా విరూపాక్ష సినిమాను ఆడియన్స్ మధ్య చూడటంకోసం వెళ్లిన దర్శకుడు కార్తీక్ దండు ఫోన్ ను ఎవరో కొట్టేయడంతో.. దర్శకుడికి కొత్త ఐఫోన్ కూడా కొని గిఫ్గ్ గా ఇచ్చింది సంయుక్తా. ఇలా తన ఇమేజ్ ను సైలెంట్ గా టాలీవుడ్ లో స్ప్రెడ్ చేస్తోంది బ్యూటీ. 

78

టాలీవుడ్ లో భీమ్లా నాయక్ తో  స్టార్ట్ అయ్యి.. బింబిసార, సార్, రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ జోడీగా విరూపాక్ష సినిమాలో నటించింది బ్యూటి. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. దిల్ ఖుష్ అవుతోంది. చాలా కాలంగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు కూడా హిట్ ఇచ్చేసింది సంయుక్తా. 

88
Samyuktha Menon

ప్రస్తుతం టాలీవుడ్ లో డెవిల్ మూవీ చేస్తోంది బ్యూటీ. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో రెండో సారి జతకట్టింది. బింబిసార తరువాత వీరి కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ ఇది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన సంయుక్తా.. డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతోంది. ఈక్రమంలోనే ఆమె.. టాలీవుడ్ తో మమేకం అవుతూ.. ఇక్కడి నుంచి పాన్ ఇండియాను టార్గెట్ చేసింది. 
 

click me!

Recommended Stories