స్టార్ కమెడియన్ ఆస్దిని సీల్ చేసిన బ్యాంక్, 11 కోట్ల అప్పు రికవరీ

First Published | Aug 15, 2024, 10:10 AM IST

తనదైన కామెడీ టైమింగ్‌తో, నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్న ఈ కమెడియన్‌ రాజ్ పాల్ రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. 


బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌ ఎప్పుడైతే తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమా చేసారో అప్పటినుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా కోసం చేసిన అప్పుల నిమిత్తం గతంలో పది రోజులు జైలు కు కూడా వెళ్లి వచ్చారు రాజ్ పాల్ యాదవ్. ఇప్పుడు ఆయన ఆస్దిని జప్తు చేసింది బ్యాంక్.  


రాజ్ పాల్ యాదవ్..  హిందీ  సినిములు చూసేవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అసవరం లేని పేరు. వందల కొద్దీ హిందీ సినిమాల్లో నటించాడతను. తెలుగులోనూ ‘కిక్-2’ సినిమాలో నటించాడు రాజ్ పాల్.  ఓ టైమ్ లో మంచి కమిడయన్ గా వెలిగిన రాజ్ పాల్ యాదవ్ ...దర్శకుడుగా ఓ చిత్రం చేసారు. ఆ సినిమాని నిర్మించాడు కూడా.2010 లో రాజ్‌పాల్‌ తనే నటిస్తూ దర్శకత్వం వహించిన ఆ చిత్రం టైటిల్  ‘ఆట పాట లపాట’. ఆ సినిమా డిజాస్టర్ కావటంతో పూర్తిగా మునిగిపోయి అప్పులు తీర్చిలేకపోయాడు. 
 


Rajpal Yadav


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రాజ్ పాల్ యాదవ్ తన ఆస్దిని కుదవ పెట్టి తీసుకున్న అప్పుని తీర్చలేదు. దాంతో ఇప్పుడు 11 కోట్లు విలువ చేసే రాజ్ పాల్ యాదవ్ ప్రాపర్టీని సీల్ చేసారు. అయితే లోకల్ బ్యాంక్ వారు తాము సీల్ చేయలేదని ముంబై నుంచి వచ్చిన లోన్ రికవరీ టీమ్ ... ఆస్దిని సీల్ చేసిందని చెప్పుకొచ్చారు. 
  

Rajpal Yadav

  
రాజ్ పాల్ యాదవ్  మాట్లాడుతూ ''గత దశాబ్దంన్నర కాలంగా నన్ను నేను రక్షించుకోవడానికి ఏ ప్రయత్నం చేయలేదు. నేను ప్రతికూలంగా ఆలోచించను. ఎవరు నెగటివ్ లేదా పాజిటివ్ అని నాకు తెలియదు. కానీ నా పని నాకు తెలుసు. పని ఉన్నచోట కర్మ ఉంది. నేను నా చిన్నతనం నుండి నా కర్మలను చేసాను మరియు ప్రతికూల లేదా సానుకూలత ఏమిటో నాకు తెలియదు. గత భారాన్ని నాతో మోయడానికి నేను ఇష్టపడను" అన్నారు రాజ్‌పాల్‌. ప్రస్తుతం ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'హంగామా 2'లో నటిస్తున్నారు రాజ్‌పాల్‌ యాదవ్‌. 

Rajpal Yadav


తనదైన కామెడీ టైమింగ్‌తో, నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్న ఈ కమెడియన్‌ రాజ్ పాల్ రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘భూల్‌భూలయియా’, ‘పార్టనర్‌’, ‘హంగామా’ లాంటి సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చాయి.

Latest Videos

click me!