Rajinikanth
రజనీకాంత్ ప్రస్తుతం సౌత్ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ సినిమా సత్తా చాటుతుంది. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్‌ని ఆయన ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇరవై ఏళ్ల క్రితమే ఆయన ఆ రేంజ్‌లో ఇండియా వైడ్‌గా సత్తా చాటాడు. ఆయన నటించిన సినిమాలు తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదలయ్యేవి. మంచి ఆదరణ పొందేవి.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడు కూడా తన మార్క్ సినిమాలతో మెప్పిస్తున్నారు. రజనీకి తన రేంజ్ సినిమా పడితే ఎలా ఉంటుందో గతేడాది `జైలర్` సినిమాతో చూపించాడు. ఈ చిత్రం ఆరువందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం విశేషం. కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. బస్ కండక్టర్ గా చేసి అట్నుంచి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన నటనలో శిక్షణ తీసుకుని హీరో అయ్యాడు రజనీకాంత్. విలన్‌గా పాత్రలు చేసుకుంటూ హీరోగా ఎదిగాడు. తన స్టయిల్‌తో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.
అయితే రజనీకాంత్ సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్‌గా చేశారని అంతా చెబుతుంటారు. రజనీకాంత్ కూడా అదే ప్రస్తావిస్తుంటారు. ఆ మధ్య తాను పనిచేసిన డిపో వద్దకువెళ్లి అక్కడ ఎంప్లాయిస్‌ని కూడా కలిశాడు రజనీకాంత్. దీంతో రజనీ హీరోగా కాకముందు కండర్టర్‌గానే చేశాడని అంతా అనుకుంటారు. కానీ ఆయన అంతకంటే ముందు మరో రెండో చోట్ల పని చేశాడు. అది రోజువారి కూలీ పని కూడా చేశాడట.
Rajinikanth Coolie Movie
కండక్టర్ జాబ్‌కి ముందు ఆయన కార్పెంటర్‌గా పనిచేశాడట. వుడ్‌తో డోర్లు, ఫర్నీచర్స్ తయారు చేసే పని చేశాడట. చాలా రోజులు ఈ పనిచేశాడట రజనీకాంత్. అంతకు ముందు మరో పని కూడా చేశాడ. ఆయన హోటల్‌లో కూడా పనిచేశాడట. హోటల్‌లో సర్వెంట్‌గానూ కొన్ని రోజులు వర్క్ చేశారట. ఆ పని నచ్చక కార్పెంటర్‌గా జాయిన్ అయ్యాడట. చాలా రోజులు ఈ పని చేశాక కండక్టర్ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఎట్టకేలకు కండక్టర్‌గా మారారు. ఈ అరుదైన విషయంఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.