Pushpa 2, allu arjun, sukumar, OTT Release
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’విశేషాలే గత వారం రోజులుగా వినిపిస్తున్నాయి. మరో పది రోజులు దాకా ఇదే పరిస్దితి కొనసాగేలా ఉంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఆరు భాషల్లో దాదాపు 12,000 స్క్రీన్లలో పుష్ప 2 రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమాని అభిమానులు మొదటి రెండు రోజుల్లోనే చూసేందుకు ప్లాన్ చేసుకుంటన్నారు. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్స్‌లు అదిరిపోతున్నాయి. మరో ప్రక్క అంతంత రేట్లు పెట్టి టిక్కెట్ కొనలేని సామాన్యుడు ఓటిటి రిలీజ్ ఎప్పుడు అంటూ ఆరా తీస్తున్నాడు.
allu arjun movie Pushpa 2 The Rule
అయితే ఇప్పటిదాకా ఈ చిత్రం ఓటిటి విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ బయిటకు రాలేదు. అయితే నేషన్ వైడ్ గా పుష్ప 2కి బాగా బజ్ క్రియేట్ కావటంతో రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గట్టిగానే పోటీపడ్డాయనేది నిజం. అయితే అందుతున్న సమాచారం మేరకు అమెజాన్‌తో చివరి వరకూ పోటీపడిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుందని అంటున్నారు. అమెజాన్ కోట్ చేసిన ధరకి మూడు రెట్లు అధికంగా నెట్‌ఫ్లిక్స్ కోట్ చేసి తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
allu arjun movie Pushpa 2 The Rule peelings song
భారతీయ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ మూవీకి లేనంతగా ఏకంగా రూ.270 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ పుష్ప 2 డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రైట్స్ రూ.175 కోట్లే పెద్ద రికార్డ్. ఇప్పుడు ఈ వార్త నిజమైతే అది బద్ధలైనట్లే. పుష్ప 1 సినిమాని అప్పట్లో అమెజాన్ రూ.30 కోట్లకి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నో రెట్లు పుష్ప2 కు పలికింది.
పుష్ప 2 ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే.. భారీ రేటుకు కొనుక్కున్నప్పుడు ఓటిటి సంస్దలు కొన్ని రూల్స్ పెడతాయి. పుష్ప 2 మూవీ 5 వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందని చెప్పుకుంటున్నారు. రిలీజ్ తర్వాత 5 వారాలు అంటే… జనవరి 10న, సంక్రాంతి సందర్భంగా నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తుందని తెలుస్తుంది. భారీ డీల్ కాబట్టి ఇలా జరిగేందుకు అవకాసం ఉందంటున్నారు.
pushpa 2
అయితే అలాంటిదేమీ లేదని, పుష్ప 2 జనవరి 25 కు కచ్చితంగా స్ట్రీమ్ కానుందని బాలీవుడ్ మీడియా అంటోంది. జనవరి 23కి పుష్ప 2 రిలీజ్ అయి 50 రోజులు అవుతుంది. 50 డేస్ ఈవెంట్ చేసిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తారని చెప్పుకుంటున్నారు.
ఏదైమైనా పుష్ప2 వంటి సినిమాలు థియేటర్ లో చూస్తేనే కిక్ ఉంటుంది. ధరలు అందుబాటులో లేకపోతే ఓ వారం తర్వాత ధరలు తగ్గాక అయినా థియేటర్ లో చూస్తేనే బెస్ట్. అంతేకానీ ఓటిటి కోసం ఎదురుచూద్దామనో, పైరసీలో చూసేద్దామనుకుంటే మంచి సినిమాటెక్ ఎక్సపీరియన్స్ మిస్ అవుతారు.
read more: ఫ్యాన్స్ ని అలా పిలుస్తున్నాడంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్
also read: పుష్ప 2: ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఫిగర్స్ షాకింగ్ ! !