11వ వారానికి గాను గౌతమ్ కృష్ణ, యష్మి, టేస్టీ తేజ, పృథ్విరాజ్, అవినాష్, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. ఆ ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్లో మొదటి రెండు స్థానాల్లో యష్మి, గౌతమ్ పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉన్నట్లు సమాచారం. గౌతమ్ టాప్ లో ఉండగా యష్మి నుండి ఆయనకు టఫ్ కాంపిటీషన్ ఎదురవుతుందట. ఇక మూడో స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడట. అవినాష్ కంటే మెరుగైన స్థితిలో టేస్టీ తేజ ఉండటం విశేషం.