75 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ రజినీకాంత్, లేడీ డైరెక్టర్ కు సూపర్ స్టార్ ఫోన్, నెక్ట్స్ మూవీ ఏంటో తెలుసా?

Published : Jan 23, 2026, 04:21 PM IST

డైరెక్టర్ సుధా కొంగరను సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్‌లో మెచ్చుకున్నారు. మీ దగ్గర ఏదైనా ప్రేమకథ ఉందా అని అడిగారు. ఓ మాస్ హీరో, మహిళా దర్శకురాలి ప్రతిభను గుర్తించడం అంచనాలను పెంచుతోంది. నెక్ట్స్ సూపర్ స్టార్ లవ్ స్టోరీలో నటించబోతున్నాడా? 

PREV
14
సంతోషంలో సుధా కొంగర

తమిళ చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకమైన దర్శకత్వంతో ముద్ర వేస్తున్న దర్శకురాలు సుధా కొంగర. 'గురు', 'ఆకాశం నీ హద్దురా' లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చిన ప్రశంస ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది.

24
ప్రశంసల వెనుక..

రీసెంట్ గా సుధా కొంగరకి ఫోన్ చేసిన రజినీకాంత్, ఆమె సినిమాలను ఎంతగానో మెచ్చుకున్నారు. ముఖ్యంగా సుధా కథ చెప్పే విధానం, సన్నివేశాలను తీర్చిదిద్దే పద్ధతి రజినీకాంత్‌ను ఆకట్టుకుంది. 'సినిమా బాగుంది' అని మెచ్చుకోవడమే కాకుండా, 'మీ దగ్గర ఏదైనా ప్రేమకథ ఉందా?' అని ఆసక్తిగా అడిగారు.

34
ప్రేమ కథతో రజినీకాంత్ సినిమా?

మాస్ హీరో అయిన రజినీకాంత్, మహిళా దర్శకురాలైన సుధా కొంగర ప్రతిభను గుర్తించడం, మంచి సినిమాలకు ఎప్పుడూ విలువ ఉంటుందని చూపిస్తుంది. రజినీ లాంటి స్టార్ ప్రేమకథపై ఆసక్తి చూపడం, ఆయన రొటీన్ శైలి నుంచి బయటకొచ్చి ఎమోషనల్ డ్రామాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్టోంది. 

44
ప్రతిభ, కృషి కలిస్తే గొప్ప విజయం

ప్రతిభ, కృషి కలిస్తే గొప్ప శిఖరాలను చేరొచ్చనడానికి సుధా కొంగర ఒక ఉదాహరణ. రజినీకాంత్ ప్రశంస కేవలం మాటలు కాదు, ఒక గొప్ప కళాకారుడు మరో కళాకారిణికి ఇచ్చిన గౌరవం. వీరి కాంబోలో భవిష్యత్తులో ఓ అందమైన ప్రేమకావ్యం రావాలని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిజంగా సుధా కొంగర తో రజినీకాంత్ సినిమా చేస్తారా? వస్తే ఎలాంటి ప్రేమ కథ తెరకెక్కబోతోందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories