ఈ ఇద్దరు స్టార్లకు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సంగతి చూసుకుంటే ఆయన 74 ఏళ్ల వయస్సులో కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. యాక్షన్, డాన్స్ ఏ విషయంల్ కూడా తగ్గకుండా సత్తా చాటుతున్నారు సూపర్ స్టార్. యంగ్ హీరోలకంటే కూడా స్పీడ్ గా సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు రజినీకాంత్.
ఆ ఎనర్జీ, ఈ వయస్సులో కూడా ఆ స్టైల్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇక కింగ్ నాగార్జున అయితే అంతకు మించి.. 65 ఏళ్ళు వచ్చినా.. లుక్స్ , ఫిట్ నెస్ , విషయంలో తగ్గడంలేదు కింగ్. 30 ఏళ్ళ యంగ్ హీరో లుక్ తో కనిపిస్తుంటారు నాగార్జున.
ఈ వయస్సులో కూడా ఫిట్ నెస్ వీషయంలో.. స్టైల్ ను మెయింటేన్ చేసే విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు నాగ్. టాలీవుడ్ మన్మధుడి.. ఇప్పటికీ అమ్మాయిల మనసుల్లో రాకుమాడిగానే ఉన్నాడునాగార్జున.