డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో గొప్ప దర్శకులలో ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. పూరి జగన్నాధ్ దర్శకుడిగా తొలి అవకాశం అందుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకసారి అవకాశం దక్కాక ఇక పూరి జగన్నాధ్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నారట. పూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడే మాస్ మహారాజ్ రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఆ సమయంలోనే పూరి జగన్నాధ్, రవితేజ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రవితేజ స్టార్ హీరో అవుతాడని పూరి జగన్నాధ్ కి అప్పుడే నమ్మకం ఉండేదట.
ఆ టైంలో నేను డైరెక్టర్ అయ్యాక నీతో సినిమా చేస్తాను అని పూరి రవితేజకి చెప్పారట. పూరి అలా అనడంతో వీడేం డైరెక్టర్ అవుతాడు ? నాతో సినిమా ఎప్పుడు చేస్తాడు ? అంటూ స్నేహితులతో ఎగతాళి చేశారట. కట్ చేస్తే అదే పూరి జగన్నాధ్ వల్ల రవితేజ స్టార్ హీరో అయ్యారు. పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బద్రి చిత్రం సూపర్ హిట్ అయింది.
Idiot Movie
ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పడానికి పూరి రవితేజ వద్దకి వెళితే.. పవన్ కళ్యాణ్ తో హిట్ కొట్టాక నన్ను పట్టించుకోవు అనుకున్నా అని అన్నాడట. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. రవితేజ అప్పట్లో ఎగతాళి చేసిన డైరెక్టరే తనని స్టార్ హీరోని చేయడం మాత్రమే కాదు.. పవన్, మహేష్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి హీరోలకు సూపర్ హిట్స్ అందించారు.