నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) లాంచింగ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది.బాలీవుడ్ తారలందరూ ఈ వేడుకలో కొలువయ్యారు. రజనీకాంత్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, కృతి సనన్, కొత్త జంట కియారా-సిద్ధార్థ్ మల్హోత్రా, దీపికా పదుకొనె, రన్వీర్ సింగ్, అలియా భట్... తదితరులు పాల్గొన్నారు. స్టార్స్ రాకతో ఈవెంట్ కలర్ ఫుల్ గా మారిపోయింది. NMACC Gala కోసం లాస్ ఏంజెల్స్ నుండి ప్రియాంక చోప్రా రావడం విశేషం. చిత్ర ప్రముఖులను మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది. ప్రతిష్టాత్మక ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి