ముంబైకి దూరమైన ప్రియాంక చోప్రా ఇండియాలో చాలా ఏళ్ల తర్వాత అడుగు పెట్టడం విశేషం. ఇటీవల బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికన్ మీడియా ఇంటరాక్షన్ లో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ... బాలీవుడ్ పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది. ఉద్దేశపూర్వకంగా అవకాశాలు రాకుండా చేశారు. ఈ క్రమంలో కొందరితో గొడవలు అయ్యాయి. బాలీవుడ్ రాజకీయాల్లో నేను ఇమడలేక పోయాను. పాలిటిక్స్ చేయడం నాకు రాదు. అందుకే బాలీవుడ్ నుండి బ్రేక్ తీసుకున్నాను, అన్నారు.