గ్రీన్ లెహంగాలో బాలయ్య భామ అందాల జాతర.. జ్యూయెల్లరి ప్రారంభోత్సవంలో ప్రగ్యా జైశ్వాల్ సందడి..

First Published | Mar 31, 2023, 9:59 PM IST

`అఖండ` హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌ (Pragya Jaiswal) ప్రస్తుతం ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా ఓ జ్యూయెల్లరీ ఓపెనింగ్ కు హాజరై ఆకట్టుకుంది.  

`అఖండ`లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్‌ మెరిసి ఆకట్టుకుంది. సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి యమా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం సినిమాల పరంగా జోరు లేకున్నా.. ఆయా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ బాగానే సందడి చేస్తోంది. 
 

రీసెంట్ గా బాలయ్య - ప్రగ్యా జైశ్వాల్ కలిసి `వేగ శ్రీ` అనే జ్యూవెల్లరి యాడ్‌ కోసం యాడ్ షూట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ప్రగ్యా తెగ సందడి చేస్తోంది. ట్రెడిషన్ ల్ లుక్ లో ఈవెంట్ కు హాజరై ఆకట్టుకుంది. 
 


వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పటికే అత్యుత్తమ జ్యూవెలరీగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మరో అతి అద్భుతమైన ఆభరణములతో ఆడవారి మనస్సు దోచె మరో ఆభరణముల ప్రపంచాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 
 

ఈ సందర్భంగా ఈరోజు మార్చి 31న ఉదయం 11.00 గంటలకు పెద్దమ్మటెంపుల్ వద్ద వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ (లక్స్‌)ని ప్రముఖ నటి ప్రగ్యా జైస్వాల్ ప్రారంభించారు. ఈ క్రమంలో మీడియాతో పాటు ప్రగ్యా అభిమానులు తరలివచ్చారు. 

గ్రీన్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో ప్రగ్యా ఆకట్టుకున్నారు. అందంతో అభిమానులతో ఆకర్షించుకున్నారు. జ్యూయెల్లరి ఓపెనింగ్ కావడంతో నగలను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. మెరిసిపోయే అందంతో అభిమానులను ఫిదా చేసింది. 
 

సినిమాల  పరంగా కాస్తా వెనకబడి ఉన్నప్రగ్యా జైశ్వాల్ ఇలా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ వనమ నవీన్ గారు, ఎం.డీ, మణిదీప్ గారు, కళ్యాణ్ కుమార్ గోళ్ళ గారు, శ్రీనివాస్ గారు, మరియు సుధాకర్  ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

Latest Videos

click me!