తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎమ్జీఆర్ తరువాత అంత స్టార్ డమ్ ఉండి.. ఆరాధించే ఫ్యాన్స్ ఉన్న హీరో రజినీకాంత్. సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్న ఆయన అంటే తమిళనాట మాత్రమే కాదు.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం దేవుడిగా ఆరాధిస్తుంటారు. 74 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ... సినిమాలు చేస్తున్నాడు రజినీకాంత్. గెలుపు ఓటములు లెక్క చేయకుండా తన అభిమానులను ఎంటర్టైన్ చేయడం కోసం కష్టపడుతున్నాడు సూపర్ స్టార్.