ఇది రజనీకి మరింత కోపం తెప్పించింది. ఆ నెక్ట్స్ ఇయర్ తమిళనాడులో ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేశారట. జయలలితకు ఓటు వేయోద్దని ఆయన ప్రచారం చేయడంతో అన్నాడీఎంకే ఓటమి పాలయ్యింది. ఏకంగా ప్రభుత్వమే కూలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంపై రజనీకాంత్ కొంత కాలానికి రియలైజ్ అయ్యారు. తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నారట. రజనీకాంత్ వల్లే తాను ఓడిపోయినా, ఆ తర్వాత ఆయన పెద్ద కుమార్తె పెళ్లికి జయలలిత వెళ్లడం విశేషం. ఈ విషయాన్ని లేటెస్ట్ గా రజనీకాంత్ బయటపెట్టారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు మరోసారి తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.