అక్కినేని చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న సావిత్రి.. ఆ సాకుతో మహానటికి బిగ్‌ హ్యాండ్‌

Savitri: మహానటి సావిత్రి మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన నటి. అద్భుతమైన నటన, అత్యద్భుతమైన రూపంతో ఆ తరం ఆడియెన్స్ ని అలరించిన నటి. స్టార్ హీరోలకు దీటుగా స్టార్ స్టేటస్‌తో రాణించింది. ఓ దశలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీఆర్‌ వంటి దిగ్గజాలను కూడా డామినేట్‌ చేసింది. సావిత్రితో సీన్‌ అంటే మరోసారి డైలాగ్‌, సీన్‌ పేపర్స్ కూడా చూసుకునేవారట ఎస్వీఆర్‌, ఎన్టీఆర్‌ లాంటి నటులు. అంతగా వారి మధ్య పోటీ ఉండేది. ఆ పోటీ నటన పరంగానూ, క్రేజీ పరంగానూ, మార్కెట్‌ పరంగానూ, డిమాండ్‌ పరంగానూ ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

Savitri shed tears for Akkineni nageswara rao what did in telugu arj
Savitri

Savitri: సావిత్రి అంటే మనకు మహానటి పేరే గుర్తుకు వస్తుంది. తన నటనతో అంతగా ఆకట్టుకుంది సావిత్రి. సినిమాల్లో తొలితరం నటిగా రాణించిన వారిలో సావిత్రి ప్రముఖంగా ఉంటారు. చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే ఆమె హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్‌ హీరోయిన్‌గా ఇండస్ట్రీని రూల్‌ చేసింది.

సావిత్రి డేట్స్ కోసం ఇటు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, అటు ఎంజీఆర్‌, శివాజీ గణేషన్‌ వంటి పెద్ద స్టార్స్ కూడా వెయిట్‌ చేయాల్సి వచ్చేదట. అంతగా మెప్పించిన సావిత్రి ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో, అంతే వేగంగా పడిపోయిందనేలా ఆమె కెరీర్‌ సాగింది. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో అనేక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. 
 

Savitri Gemini Ganesan

భర్త జెమినీ గణేషన్‌ కారణంగా ఆమె డిస్టర్బ్ అయ్యింది. దర్శకురాలిగా, నిర్మాతగా మారి మరింతగా నష్టపోయింది. రాజకీయ నాయకుడి కారణంగా లీగల్‌ వివాదాల్లోనూ ఇరుక్కుంది. మొత్తంగా అన్ని రకాలుగా కష్టాలు ఆమెని చుట్టుముట్టాయి. ఒంటరిని చేశాయి.

చివరికి ఆమె ప్రాణాలనే బలితీసుకున్నాయి. పరిస్థితులను, మనుషులను డీల్‌ చేయడంలో విఫలమయ్యింది సావిత్రి. మంచి తనమే మైనస్‌గా మారింది. నా అనుకున్నవారే మోసం చేశారు. చివరికి ఆమె జీవితం విషాదంగా ముగిసేలా చేశారు.  


anr

ఇదిలా ఉంటే సావిత్రి అక్కినేనితో చాలా సినిమాలు చేశారు. కానీ ఒక మూవీ విషయంలో సావిత్రి చాలా బాధపడిందట. కన్నీళ్లు పెట్టుకుందట. మరి ఆ సినిమా ఏంటనేది చూస్తే. అన్నపూర్ణ బ్యానర్‌లో అప్పట్లో సినిమా వచ్చిందంటే కచ్చితంగా హీరోయిన్‌గా సావిత్రి ఉండాల్సిందే. అలా నియమం కూడా పెట్టుకున్నారు.

అప్పట్లో సావిత్రి లేకుండా ఆ స్టూడియో ఒక్క మూవీ కూడా వచ్చేది కాదు. కానీ `ఇద్దరు మిత్రులు` సినిమా విషయంలో ఆ నియమం బ్రేక్‌ అయ్యింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకి స్కోప్‌ ఉంది. కానీ ఆయా పాత్రలకు పెద్దగా ప్రయారిటీ లేదు. దీంతో సరోజా, రాజ సులోచనలతో చేయించారు. 
 

Savitri

ఇందులో ఏఎన్నార్‌ ద్విపాత్రాభినయం. ఆయనకు జోడీగా ఈ ఇద్దరు హీరోయిన్లని తీసుకోగా, సావిత్రికి హ్యాండిచ్చారు. ఈ మూవీలో తానే హీరోయిన్‌ అని ఆమె ఫిక్స్ అయ్యిందట, కానీ తీర ఆమె కాదని చెప్పడంతో, ఆ మూవీ ఆఫర్‌ కోల్పోవడంతో తెగ బాధపడిందట సావిత్రి. అంతేకాదు కన్నీళ్లు పెట్టుకుందట.  ఏఎన్నార్‌ చేసిన పనికి మహానటి కంటతడి పెట్టుకునే పరిస్థితి వచ్చిందట.

అది అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదూర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన `ఇద్దరు మిత్రులు` 1961లో విడుదలై సంచలన విజయం సాధించింది. కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా శతదినోత్సవ వేడుకలకు సావిత్రినే గెస్ట్ గా వచ్చి అందరికి షీల్డు బహుకరించింది. 

read  more: యాంకర్‌ ప్రదీప్‌ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` మూవీ రివ్యూ

also read: నాకు వెనకాల ఎవరూ లేరు, అందుకే నటించడం లేదు.. రేణు దేశాయ్‌ ఎమోషనల్‌ కామెంట్స్
 

Latest Videos

vuukle one pixel image
click me!