అజిత్, త్రిష
ఇక తాజాగా త్రిష, అజిత్ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అజిత్ అభిమానులకు మంచి ట్రీట్ అయ్యింది. సినిమాకు అజిత్ అభిమానుల నుంచి భారీ ఆదరణ లభిస్తుండటంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత నటి త్రిష మాత్రం చాలా కోపంగా ఉందట.
Also Read: అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?
త్రిష ఇన్స్టా పోస్ట్
ఈసినిమా రిలీజ్ తరువాత త్రిష పెట్టిన ఇన్స్టా పోస్ట్ అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. . ఆ పోస్ట్‌లో ‘ఛా.. టాక్సిక్ మనుషుల్లారా... మీకెలా నిద్ర పడుతుందో? సోషల్ మీడియాలో ఉండి తెలివి తక్కువగా మనుషులు మీరు. ఇతరుల గురించి పోస్ట్‌లు పెట్టడమే మీ పనా? మీకోసం, మీతో జీవించేవారి కోసం చాలా బాధపడుతున్నాను. ఇది పిరికితనం. గాడ్ బ్లెస్ యూ’ అని పోస్ట్ చేసింది. హేటర్స్‌కు కౌంటర్ ఇవ్వడానికే ఆమె ఈ పోస్ట్ పెట్టింది.
Also Read: సమంత - తమన్నా, పోటా పోటీగా ఐటెం సాంగ్స్ తో, డాన్స్ అదరగొట్టిన హీరోయిన్లు
త్రిష, నయనతార
అసలు త్రిషకు ఇంత కోపం ఎందుకు వచ్చింది. అలా వచ్చేలా ఎవరు ఏం చేశారు అంటే? ఆమె కోపానికి కారణం నయనతార అభిమానులట. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో త్రిష నటనను మెచ్చుకుంటూ ఆమె అభిమానులు ఒకే ఒక్క లేడీ సూపర్ స్టార్ ఉంది.. అది మా త్రిష మాత్రమే అని పోస్ట్ చేయగా, దీనికి నయనతార అభిమానులు కౌంటర్ ఇస్తూ గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష నటన బాగాలేదని విమర్శించడంతో పాటు 20 ఏళ్లుగా సినిమాలో నటిస్తున్నా సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పడం చేతకాదు. నటన కూడా ఆమెకు రాదు అని రిప్లై ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ జరిగింది.
Also Read: 1000 కోట్లు ఇచ్చిన ప్రభాస్ ఆ పని మాత్రం చేయనంటున్నాడు, హాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్
హేటర్స్‌కు త్రిష రిప్లై
ఈ గొడవతో టెన్షన్ పడిన త్రిష, నయనతార అభిమానులను అటాక్ చేసేలా ఒక పోస్ట్ పెట్టింది. ఆమె నయనతార అభిమానులను విమర్శించేందుకే ఈ పోస్ట్ పెట్టిందని, అందులో ఆమె పేర్కొన్న టాక్సిక్ అనే పదమే కారణం. ఎందుకంటే నయనతార ప్రస్తుతం నటిస్తున్న సినిమా పేరు టాక్సిక్. దానిని ఉద్దేశించే త్రిష ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు డీకోడ్ చేస్తున్నారు.