లాల్ సలామ్ ట్విట్టర్ రివ్యూ: రజినీకాంత్ ఎంట్రీ హైలెట్ కాగా, సినిమా ఎట్లుంది అంటే!

First Published Feb 9, 2024, 11:13 AM IST


విష్ణు విశాల్-విక్రాంత్ ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లాల్ సలామ్. సూపర్ స్టార్ రజినీకాంత్ ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేశారు. ఫిబ్రవరి 9న లాల్ సలామ్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. 
 

లాల్ సలామ్ ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు ఏర్పడ్డాయి. మతసామరస్యం చాటి చెబుతూ స్పోర్ట్స్ డ్రామాగా లాల్ సలామ్ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అనూహ్యంగా వాయిదా పడింది. రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన నేపథ్యంలో మూవీకి ప్రచారం దక్కింది.

 

లాల్ సలామ్ ప్రీమియర్స్ ముగియగా ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. మరి లాల్ సలామ్ అంచనాలు అందుకుందో లేదో చూద్దాం... 
 

Latest Videos


Lal Salaam

స్ట్రాంగ్ కంటెంట్ తో తెరకెక్కించిన చిత్రం లాల్ సలామ్. డైరెక్టర్ అనుభవలేమి సినిమాలో అక్కడక్కడా కనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. మొత్తంగా లాల్ సలామ్ చూడదగ్గ చిత్రం అని ఒక నెటిజెన్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. 

సోషల్ మీడియాలో ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం లాల్ సలామ్ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మంచి కంటెంట్ తో తెరకెక్కిన చిత్రం అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో రజినీకాంత్ ఎంట్రీ హైలెట్ అంటున్నారు. 

మొయిద్దీన్ భాయ్ గా రజినీకాంత్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన కాసేపు థియేటర్స్ లో ఫ్యాన్స్ గూస్ బంప్స్ అంటున్నారు. ఏ ఆర్ రెహమాన్ బీజీఎమ్ బాగుందన్న మాట వినిపిస్తోంది. ఉన్నత నిర్మాణ విలువలతో లాల్ సలామ్ తెరకెక్కిందట. 

లాల్ సలామ్ మూవీని తెలుగులో ప్రమోట్ చేయలేదు. అసలు రజినీకాంత్ సినిమా ఎలాంటి హైప్ లేకుండా విడుదల కావడం ఏమిటీ? ఇవాళ రిలీజ్ అని కూడా తెలియదు అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పూర్ ఓపెనింగ్స్ కి ఇది కారణమైంది. 

click me!