ముద్దుతో వెంకటేష్ ను భయపెట్టిన మీనా, నవ్వులు పూయించిన హీరోయిన్

First Published | Feb 9, 2024, 10:36 AM IST

టాలీవుడ్ సీనియర్ మీరో విక్టరీ వెంకటేష్ ను ఒక్క ముద్దుతో భయపెట్టిందట హీరోయిన్ మీన. ఈవిషయాన్ని తాజాగా ఓ ప్రోగ్రామ్ లో వెల్లడించింది సీనయిర్ హీరోయిన్. ఇంతకీ వియం ఏంటీ అంటే.
 

Meena

హీరోయిన్ గామీనా..90స్ లో ఒక ఊపు ఊపేసింది. టాలీవుడ్ తో పాటు.. కోలీవుడ్ లో కూడా దాదాపు  స్టార్ హీరోలందరితో నటించేసింది. ఆమె సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ అయ్యేవి. ఇక టాలీవుడ్ లో ఆమె మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబు లాంటి హీరోలందరితో నటించి మెప్పించింది. 

ఆతరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా ఆమె మాత్రంఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ దృశ్యం లాంటి సినిమాలతో హీరోయిన్ గానే నటిస్తూ.. తన ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తోంది. బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మీన హీరోయిన్ గా మంచి కెరీర్ ను చూసింది. ఆతరువాత కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్ళి చేసుకుని ఇల్లాలిగామారింది. 


ఆతరువాత చాలా కాలం సినిమాలకు దూరం అయిన మీనాకు ఓ పాప పుట్టడం.. ఆమె ఆలనా పాలన చూసుకుంటూ.. ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోయింది. ఇక కోవిడ్ టైమ్ లో భర్తను కోల్పోయిన మీనా.. చాలాకాలం ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోయింది. ఇక ఇప్పుడిప్పుడేమళ్ళీ సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ తో బిజీ అవుతోంది సీనియర్ బ్యూటీ. 
 

ప్రస్తుతం జీలో ప్రసారం అవుతున్న సెలబ్రిటీ డాన్స్ షోకు జడ్జిగా వ్యావహరిస్తోంది మీనా. ఉదయభాను హోస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ కు హీరోయిన్ శ్రీదేవి, కొరియోగ్రఫర్ రఘుమాస్టర్ కూడా జడ్జిలుగా ఉన్నారు. కాగా సక్సెస్ ఫుల్గా సాగుతున్న ఈ డాన్స్ షోలో మీనా చంటి సినిమాలో ఓ పాటను రీ క్రియేట్ చేశారు. అద్భుతంగా పెర్ఫామ్ చేశారు.
 

ఇక ఈ పెర్ఫామెన్స్ చూసిన మీనా.. చంటీ సినిమా గురించి గుర్తు చేసుకున్నారు. అందులో ఒ సన్నివేశం గుర్తు తెచ్చుకున్నారు. క్లైమాక్స్ లో గాజు పెంకుల మీద నడుకుంటూవచ్చే సీన్ లో హీరోవెంకటేష్ ను గట్టిగా కౌంగిలించుకునిముద్దు పెట్టే సీన్ ఉంది.. నేను అలా చేసే సరికి వెంకటేష్ భయపడ్డారు అంటూ కాసేపు నవ్వులు పూయించారు మీనా. 

వెంకటేష్ హీరోగా.. 1991 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ చంటీ. రవిరాజ పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మీనా హీరోయిన్ గా నటించి మెప్పించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వగా.. ఆసినిమా పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. 

వెంకటేషన్ మీనా కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు అన్నీ సినిమాలు హిట్ అయ్యాయి. అందుకే మీనాను తన లక్కీ హీరోయిన్.. హిట్ హిరోయిన్ అంటాడు వెంకీ. వీరి కాంబోలో అబ్బాయిగారు, చంటి, సూర్య వంశం నుంచి మొన్న మొన్నటి దృశ్యం సినిమాల వరకూ.. అన్ని సినిమాలు సూపర్ హిట్టే. 

Latest Videos

click me!