BrahmaMudi 9th February Episode:కావ్యకు పట్టం కట్టిన అత్త, కవిని ఊరిస్తున్న అనామిక, కావ్య పై రుద్రాణి కుట్ర

First Published | Feb 9, 2024, 10:40 AM IST

అపర్ణ.. ఈరోజు నువ్వు ఒక పని చేయాలి అని చెబుతుంది. ఏంటో చెప్పమని కావ్య అడిగితే.. ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకోవాలి అని అంటుంది.

Brahmamudi


BrahmaMudi 9th February Episode:దుగ్గిరాల ఇంట్లో పెద్ద కోడలు పెత్తనం కొనసాగుతూ ఉంటుంది. అంటే.. ఇంట్లో ఎవరికి ఏది కావాలి అన్నా కూడా ఒక లిస్ట్ తయారు చేసి అపర్ణ కి ఇస్తూ ఉంటారు. రుద్రాణి లిస్ట్ లో ఎక్కువ తలనొప్పి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఎందుకు అంటే.. తన కోడలి కారణంగా అవి ఎక్కువ అవసరం అవుతున్నాయి అని చెబుతుంది. ఎవరు చేసిన ఖర్మకు వారు అనుభవించక తప్పదు అని అపర్ణ అంటే.. నా కొడుకు చేసిన కర్మకి నేను అనుభవిస్తున్నాను అని రుద్రాణి బదులిస్తుంది.

Brahmamudi

తర్వాత ప్రకాశం వచ్చి తన లిస్ట్ కూడా ఇస్తాడు, దాంట్లో షేవింగ్ క్రీమ్ ఒక్కటే రాస్తాడు. అదొక్కటే ఎందుకు రాశావ్ అంటే,, మర్చిపోయాను అంటాడు. అయితే.. లాస్ట్ మంత్ లిస్ట్ ఫోటో తీసి పెట్టాను అని.. దాని ప్రకారం తెప్పిస్తాను అని అపర్ణ చెబుతంది. ఇక ధాన్యలక్ష్మి తన లిస్ట్ చేతిలో పట్టుకొని.. ఇప్పుడు ఈవిడ ముందు నేను ఒక మెట్టు కిందకు దిగాలా అని ఆలోచిస్తుంది. తన భర్తను పిలిచి తన లిస్ట్ ఇవ్వమని అడుగుతుంది. కానీ ప్రకాశం నేను ఇవ్వను అని తెగేసి చెబుతాడు. ఇక చేసేది లేక.. ఎలా అడగాలా అని ధాన్యలక్ష్మి తెగ ఇబ్బంది పడుతుంటే అపర్ణ గమనిస్తుంది. ఇప్పుడు అహం అడ్డొచ్చిందా.. ఇప్పుడు చెబుతా చూడు నీ సంగతి అని మనసులో అపర్ణ అనుకుంటుంది.


Brahmamudi

సరిగ్గా అదే సమయానికి కావ్య పై నుంచి కిందకు వచ్చి కిచెన్ లోకి వెళ్తూ ఉంటుంది. అపర్ణ కావ్యను పిలుస్తుంది. కావ్య రావడంతో.. నీకు ఏమీ అవసరం లేదా అని అడుగుతుంది. అయితే.. తనకు పెద్ద లిస్ట్ ఏమీ లేదని.. మీ అబ్బాయి లిస్ట్ లోనే నాకు కవాల్సిన కొన్ని చిన్న చిన్నవి రాశాను అని చెబుతుంది. అయితే.. అపర్ణ.. ఈరోజు నువ్వు ఒక పని చేయాలి అని చెబుతుంది. ఏంటో చెప్పమని కావ్య అడిగితే.. ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకోవాలి అని అంటుంది.

Brahmamudi

నేనా అని కావ్య నసుగుతుంటే.. నువ్వే అని.. ఇంటికి సంబంధించినవి ఏవైనా నువ్వే తెప్పించాలని..  ఇంతకాలం ఆ పనులు తాను చూసుకున్నానని.. ఇక నుంచి ఈ దుగ్గిరాల వంశం పెద్ద కోడలిగా బాధ్యతలు నీకే అప్పగిస్తున్నాను అని అపర్ణ చెబుతుంది. ఆ మాటకు ఇందిరాదేవి సంతోషిస్తుంది. కానీ.. కావ్య తాను ఆఫీసుకు వెళ్తున్నానని... తాను అక్కడ ఉంటే.. ఇక్కడ ఎవరికైనా అవసరం వచ్చి ఇబ్బంది పడపతారేమో అని చెబుతుంది. అంత ఎమర్జెన్సీ ఏమీ రాదులే అని అపర్ణ చెబుతుంది. వెంటనే తన దగ్గర ఉన్న ఇంటి లాకర్ తాళాలు కావ్య చేతిలో పెడుతుంది.  సుభాష్, ప్రకాశం, ఇందిరాదేవి సంతోషిస్తే.. ధాన్యలక్ష్మి, అనామిక, రుద్రాణి ముఖాలు మాడిపోతాయి.

Brahmamudi

కానీ.. అది తీసుకోవడానికి కావ్య వెనకాడుతుంటే.. ఇది అత్తగారిగా తన ఆర్డర్ అని చెబుతుంది.  ఇందిరాదేవి కూడా.. తీసుకోమని.. ఇది ఈ ఇంటి గౌరవానికి గుర్తులని.. ఆ గౌరవం నీకు దక్కిందని తీసుకోమని చెబుతుంది. ఆ తర్వాత అపర్ణ.. ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ దగ్గరకే రావాలి అని అపర్ణ అంటుంది. ఆ తాళాలు తీసుకోమని సుభాష్ కూడా చెబుతాడు. ప్రకాశం కూడా.. తీసుకోమ్మా అని చెబుతాడు. ఇంత మంది చెప్పాలా.. ఇది నీ హక్కు తీసుకో అని గట్టిగా బెదిరించి మరీ ఇస్తుంది. అప్పుడే వచ్చిన కళ్యాణ్ కూడా అది చూసి సంతోషిస్తాడు.

Brahmamudi

వెంటనే.. ఆ లిస్టులు కావ్య చేతిలో పెట్టి..అన్నీ తెప్పించమని చెబుతుంది. కళ్యాణ్ వచ్చి.. ఆల్ ది బెస్ట్ అని చెప్పి.. తన లిస్ట్ ఇస్తాడు. మీకు ఏం కావాలో నాకు తెలుసు కవి గారు అని పెన్నులు, పేపర్లు చెబుతుంది కావ్య.. అయితే.. వాళ్ల ఆవిడ కోసం మల్లెపూలు కూడా తెప్పించమ్మా అని ఇందిరాదేవి సెటైర్ వేస్తుంది. తర్వాత.. కళ్యాణ్.. అనామిక నీకు ఏమీ వద్దా అని అడుగుతాడు. తనకు కావాల్సినవన్నీ తన పుట్టింటి నుంచి తెప్పించుకున్నాను అని అనామిక అంటుంది. ఆ మాటకు అందరూ షాకౌతారు.

Brahmamudi

అపర్ణ సెటైర్ వేస్తుంది. ‘ పుట్టింటి నుంచి తెప్పించుకున్నావా? నీ పుట్టింటి ఆడంభరం అత్తింట్లో చూపించకు’ అని అనామిక మీద అపర్ణ కోప్పడుతుంది. వెంటనే రుద్రాణి అందుకుంటుంది. ‘ పుట్టింటిలో గతిలేక పిన్నీసులు కూడా తెచ్చుకోలేనివారు ఉన్నారు. తను తెచ్చుకుంటే తప్పేంటి వదిన’ అని రుద్రాణి అంటుంది. 

Brahmamudi

ఆ తర్వాత కావ్య ‘ కవిగారు .. అనామిక పుట్టింటి నుంచి తెప్పించినవన్నీ వాళ్ల పుట్టింటికే పంపించండి. ఈ ఇంట్లో అనామికకు కావాల్సినవన్నీ లిస్ట్ రాసి ఇవ్వమని చెప్పండి ’ అని అంటుంది. వెంటనే ఇందిరాదేవి.. కావ్యను సపోర్ట్ చేస్తుంది. దుగ్గిరాల ఇంటి కోడలు సబ్బులు, పౌడర్లు కూడా పుట్టింటి నుంచి తెప్పించుకోవాలా అని అంటుంది. మావాళ్లు ప్రేమ గా ఇచ్చారు అని అనామిక అంటే.. మేం కూడా ప్రేమగానే కొనిస్తాం అని ఇందిరాదేవి వెటకారంగా చెబుతుంది. తర్వాత ఇంకెవరైనా లిస్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వమని ధాన్యలక్ష్మిని ఉద్దేశించి అపర్ణ మాట్లాడుతుంది.  తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  ధాన్యలక్ష్మికి తన లిస్ట్ కావ్యకు ఇవ్వడం ఇష్టంలేక.. పేపర్ పడేసి వెళ్తుంది. అయితే.. ఆ పేపర్ కావ్య తీసుకుంటుంది.

Brahmamudi

ఈ ఇంటి మీద ఆధిపత్యం కోసం తాను ఎదురుచూస్తుంటే అని అనామిక అంటే.. నీకు ఎదురుతగిలిందా అని రుద్రాణి పూర్తి చేస్తుంది. అయితే.. తనకు ఎదురేలేకుండా చేసుకుందామని అనుకున్నాను అని అనామిక చెబుతుంది.  ఎదరుతిరుగుతాను అని అనామిక అంటే.. వద్దు అని.. మంచి అవకాశం మన ముందే ఉందని.. దానిని వాడుకుందామని రుద్రాణి సలహా ఇస్తుంది. కావ్యను ఇరికించడానికి మంచి అవకాశం వచ్చిందని చెబుతుంది. అనామిక కూడా వెంటనే ఒప్పుకుంటుంది.

Brahmamudi

సీన్ కట్ చేస్తే.. అప్పూ తన తండ్రి తో కలిసి పోలీసు ఉద్యోగం గురించి ట్రైనింగ్ లో జాయిన్ అవ్వడానికి వెళతారు. అయితే.. తనకు లంచం ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తాను అని ఓ వ్యక్తి అప్పూ దగ్గరకు వస్తాడు. అయితే.. అప్పూ అతన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తుంది. తనకు అడ్డదారిలో వచ్చే ఉద్యోగం వద్దని వార్నింగ్ కూడా ఇస్తుంది. మూర్తి కూడా అంతే సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. తర్వాత అప్పూ.. తాను పట్టుదలతో ఉద్యోగం సాధిస్తాను అని తండ్రితో చెబుతుంది.

Brahmamudi

ఇక ఇంట్లో అనామిక రెడీ అవుతూ ఉంటుంది. కళ్యాణ్ వచ్చి కారు కీస్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే.. కావాలని కళ్యాన్ రెచ్చగొట్టాలని నడుము చూపిస్తూ అనామిక ఊరిస్తూ ఉంటుంది. కళ్యాణ్ ఆ నడుము చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటాడు. తన కవితలు చెబుతూ దగ్గరకు వెళతాడు. అనామిక నడుముకు దిష్టి చుక్క కూడా పెడతాడు. అయితే.. దగ్గరకు వచ్చిన కళ్యాణ్ ని అనామిక తోసేస్తుంది. తర్వాత.. కళ్యాణ్ ఆఫీసుకు వెళ్లడం లేదనే టాపిక్ తీసుకువస్తుంది. ఆఫీసుకు వెళ్తేనే కార్యం  అని తేల్చి చెబుతుంది. దీంతో.. కళ్యాణ్ ఈ రోజు నుంచి ఆఫీసుకు వెళతాను అని చెబుతాడు. ఇంత అందమైన భార్య కోసం వెళతాను అని అంటాడు. అయితే సూట్ వేసుకొని వెళ్లమని అనామిక అడుగుతుంది.  కళ్యాణ్ తో ఒకే చెప్పించడంతో.,. ఈ ఇంటికి తాను మహారాణి అవ్వడం ఖాయమని అనుకుంటుంది.

Brahmamudi

మరోవైపు రాజ్, కావ్యలు ఆఫీసుకు రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే రాజ్ కి శ్వేత ఫోన్ చేస్తుంది.  కావ్య వింటోందని రాజ్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. కానీ అవతల మాత్రం శ్వేత.. తన డివోర్స్ విషయంలో తన భర్త ఏం చేస్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.  అయితే.. రాజ్ ని ఫాలో అయ్యి నిజం తెలుసుకోవాలని కావ్య ఫిక్స్ అవుతుంది.  కావ్య రెడీ అవుతుంటే.. రుద్రాణి దొంగచాటుగా లోపలికి వస్తుంది. లాకర్ కీ కొట్టేద్దామని వచ్చి.. దానిని కావ్యకు కనిపించకుండా డస్ట్ బిన్ లో పడేస్తుంది.

Brahmamudi

కావ్యకు కీస్ ఎక్కడ దొరికేస్తాయా అని  రుద్రాణి టాపిక్ డైవర్ట్ చేస్తుంది.  కావ్య మర్చిపోయి వెళ్లిపోతుంది. కావ్య వెళ్లగానే.. ఆ కీస్ ని రుద్రాణి కొట్టేస్తుంది.  తర్వాత ఆ కీస్ తీసుకొని అనామిక దగ్గరకు వస్తుంది. కావ్యకు డౌట్ రాకుండా తీసుకువచ్చాను అని చెబుతుంది.  ఈలోగా.. తాను కళ్యాణ్ ని ఆఫీసుకు పంపిస్తున్నాను అని అనామిక చెబుతుంది. అయితే.. అనామికను వాడి.. తన ఆశలన్నీ నిజం చేసుకుంటాను అని  రుద్రాణి మనసులోనే అనుకుంటుంది. ఈ కీ వ్యవహారంతో.. ఇంట్లో కావ్యను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కమింగప్ లో రాజ్.. శ్వేత తో పెళ్లి చేసుకుందాం అని కావ్యకు వినేలా చెబుతూ ఉంటాడు. అది విని కావ్య ఏడుస్తుంది.

Latest Videos

click me!