సామాన్యుడిలా సూపర్ స్టార్, సినిమాలకు విరామం హిమాలయాల్లో రజనీకాంత్, నెటిజన్లు ఏమంటున్నారంటే?

Published : Oct 06, 2025, 09:45 AM IST

Rajinikanth Himalayas Trip : సినిమాలకు బ్రేక్ ఇచ్చి హిమాలయాల బాట పట్టారు సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్. స్టార్ హీరోలా కాకుండా సామాన్యుడిలా ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు తలైవా.

PREV
15
సామాన్యుడిలా సూపర్ స్టార్

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ సామాన్యుడిలా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్న స్టార్ నటుడు, సాధారణ ప్రజలతో కలిసి తీర్ధయాత్రకు బయలుదేరాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నరజినీకాంత్, జైలర్ 2 షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. అత్యంత సన్నిహిత స్నేహితులతో కలిసి హిమాలయ పర్వతాల్లో దైవ ధ్యానంలో మునిగిపోయారు రజినీకాంత్. స్టార్‌డమ్, హడావిడి, సెక్యురిటీ లాంటి వాటికి దూరంగా, సింపుల్ లైఫ్ ను హ్యాపీగా గడుపేస్తున్నారు తలైవా.

25
ఆధ్యాత్మిక విరామంలో రజినీకాంత్

తాజాగా రజినీకాంత్ రిషికేశ్‌లోని స్వామి దయానంద ఆశ్రమానికి వెళ్లి స్వామి దయానందకు నివాళులు అర్పించారు. గంగా నది ఒడ్డున ఆయన ధ్యానం కూడా చేశారు, గంగా హారతిలో పాల్గొన్న సూపర్ స్టార్, చుట్టు పక్కల దేవాలయాలు దర్శించారు. మీడియా కథనాల ప్రకారం, ఆయన మరికొన్ని రోజులు అక్కడే ఆశ్రమంలో ఉంటూ, ధ్యానంలో సమయం గడపబోతున్నట్టు తెలుస్తోంది. రజినీకాంత్ యాత్రకు సంబంధించిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

35
విస్తరి ఆకులో తలైవా భోజనం

రజినీకాంత్ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఒకదానిలో ఆయన రోడ్డు పక్కన ఆకులో భోజనం చేస్తూ కనిపించారు. సింపుల్ గా తెల్ల బట్టలు ధరించి, రోడ్డు పక్కన రాయిపై పెట్టిన ఆకు విస్తరిలో భోజనం చేస్తూ కనిపించారు రజినీకాంత్. చుట్టూ అందమైన కొండలు కనిపిస్తున్నాయి. దగ్గరలోనే ఒక కారు ఆగి ఉంది. మరికొన్ని ఫోటోలలో ఆయన ఆశ్రమంలో ఉన్న కొంతమందితో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఇంకో ఫోటోలో ఒక పూజారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు కనిపించారు.

45
రజినీకాంత్‌పై నెటిజన్ల ప్రశంసలు

చాలా మంది సోషల్ మీడియా యూజర్లు రజినీకాంత్ నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్ పోస్ట్ లో "ఆయన చాలా డిఫరెంట్... అద్భుతం" అని రాశారు. ఇంకొకరు, "ఆయన ఎప్పుడూ స్ఫూర్తినిస్తారు" అని రాశారు. మరొకరు, "సూపర్ స్టార్, సింపుల్ స్టార్" అని రాశారు. ఒక పోస్ట్‌లో, "రజినీకాంత్ సింప్లిసిటీ నిజంగా అద్భుతం. ఈ రోజుల్లో పెద్ద నటులు ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ప్యాచ్, స్టైలిష్ లుక్ కోసం లక్షలు ఖర్చు చేస్తుంటే, రజినీకాంత్ వీటిలో దేనిపైనా ఆధారపడరు" అని ఉంది. ఇలా ఆయన అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్లతో రజినీకాంత్ ను ప్రశంసిస్తున్నారు.

55
రజినీకాంత్ సినిమాలు

ఈ ఏడాది కూలీ సినిమాతో సందడి చేశారు రజినీకాంత్. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించి మెప్పించారు. మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, రచితా రామ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్ లో 'జైలర్ 2' షూటింగ్‌లో ఉన్నారు. ఇటీవల, కమల్ హాసన్‌తో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. అఫీషియల్ గా ప్రకటన మాత్రం రాలేదు.

Read more Photos on
click me!

Recommended Stories