Huma Qureshi: 39 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటోన్న రజనీకాంత్‌ హీరోయిన్‌.. సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్‌

Published : Sep 16, 2025, 10:56 PM IST

రజనీకాంత్‌ హీరోయిన్‌ హ్యూమా ఖురేషి పెళ్లికి రెడీ అయ్యింది. తన ప్రియుడితో రహస్యంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇంతకి హ్యూమా ఖురేషీ పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అనేది చూస్తే    

PREV
15
`కాలా`తో హ్యూమా ఖురేషీ కోలీవుడ్‌ ఎంట్రీ

బాలీవుడ్ సినిమాతో నటిగా పరిచయమైంది హ్యూమా ఖురేషి. గ్యాంగ్స్ ఆఫ్‌ వస్సేపూర్‌` చిత్రంలో నటించింది. ఆ తర్వాత `కాలా` చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.  తన సహజ నటన, అందంతో తొలి సినిమాతోనే తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమెను తమిళంలో పరిచయం చేసిన ఘనత దర్శకుడు పా రంజిత్‌దే. 

25
`కాలా` సినిమాతో మెప్పించిన హ్యూమా

పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కాలా' సినిమాలో హ్యూమా ఖురేషి రజినీకాంత్ మాజీ ప్రియురాలి పాత్రలో నటించింది. రజినీకి దీటుగా పరిణితి చెందిన నటనను ప్రదర్శించింది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. 

35
అజిత్‌తో `వలిమై`లో సందడి

తమిళం, హిందీనే కాకుండా మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ హ్యూమా ఖురేషి నటించింది. ముఖ్యంగా అజిత్ హీరోగా 2022లో బోనీ కపూర్ నిర్మాణంలో, హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన 'వలిమై' సినిమాలో అజిత్‌కు జోడీగా నటించింది. భారీ అంచనాలతో రూ.150 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.234 కోట్లు వసూలు చేసింది. .

45
హ్యూమా ఖురేషి రహస్య నిశ్చితార్థం:

ఇటీవల సినిమాలతోపాటు హీరోయిన్ బలమైన కంటెంట్‌ ఉన్న వెబ్ సిరీస్‌లలో నటించడంపై దృష్టి పెట్టింది. 39 ఏళ్ల హ్యూమా ఖురేషి ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండగా, ఇప్పుడు తన చిరకాల ప్రియుడు రచీత్ సింగ్‌తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్టు సమాచారం.

55
ఎవరీ రచీత్ సింగ్?

రచీత్ సింగ్ చాలా మంది బాలీవుడ్ నటులకు యాక్టింగ్ కోచ్‌గా పనిచేశాడు. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో టాక్. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో పెళ్లి తేదీతో హుమా, రచీత్ తమ ప్రేమ వివాహం గురించి ప్రకటిస్తారని భావిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories