Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?

Published : Dec 12, 2025, 04:33 PM IST

Rajinikanth Retirement : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన రజినీకాంత్ 75 వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈక్రమంలో మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో అభిమానులు ముందుకు రాబోతున్నారు తలైవా.. ఈసినిమాల తరువాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? 

PREV
16
సూపర్‌స్టార్ రజినీకాంత్ కు 75 ఏళ్లు

సూపర్‌స్టార్ రజినీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1950లో పుట్టిన రజినీకాంత్‌కు నటన ప్రయాణం అంత సులువుగా సాగలేదు. చాలా కష్టపడ్డాక మొదటి పాత్ర దొరికింది. అది కూడా ఒక అతిధి పాత్రే. మొదటి సినిమాలో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించారు తలైవా.

26
బస్ కండెక్టర్ నుంచి సూపర్ స్టార్ గా

రజినీకాంత్ సౌత్ ఇండియన్ కాదు, మరాఠీ కుటుంబానికి చెందినవారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. సినిమాల కోసం తన పేరు రజినీకాంత్ గా మార్చుకున్నారు. కర్నాటకలో బస్ కండెక్టర్ గా పనిచేసిన రజినీకాంత్.. సినిమాల మీద ప్రేమతో చెన్నై చేరారు. తన స్నేహితుడి సహాయంతో అక్కడే ఉంటు.. అవకాశాల కోసం తిరిగారు. బాలచందర్ అవకాశాలు ఇవ్వడంతో.. అంచలంచలుగా ఎదుగుతూ.. సూపర్ స్టార్ రేంజ్ కు చేరుకున్నారు.

36
75 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో చురుగ్గా

రజినీకాంత్ 75 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో చురుగ్గా ఉన్నారు. ఆయన నెక్ట్స్ మూడు  సినిమాలతో సందడి చేయబోతున్నారు. ఈ జాబితాలో  ఒకటి జైలర్ 2, ఈ సినిమా  షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్  చేస్తున్న ఈమూవీ జైలర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇది 2026లో విడుదల అవుతుంది. ఇది కాకుండా కూలీ 2, తలైవా 173లో కూడా రజినీకాంత్ కనిపించబోతున్నారు.  ఈ సినిమాలు 2027 నాటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 

46
రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?

రజినీకాంత్ తన 5 దశాబ్దాల కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 171 సినిమాల్లో నటించారు. ఆయన మొదటి సినిమా 1975లో కె. బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన.  'అపూర్వ రాగంగళ్'. ఈసినిమా హిట్ తరువాత సూపర్ స్టార్ తిరిగి చూసుకోలేదు. అయితే తాజాగా ఆయన రిటైర్మెంట్ పకటించబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఈ విషయంపై రజినీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ నెట్టింట మాత్రం రజినీకాంత్ రాబోయే మూడు సినిమాల తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. 

56
ఇతర భాషల్లో సూపర్ స్టార్ సినిమాలు

రజినీకాంత్ తమిళంలో మాత్రమే కాదు.. తెలుగు, యలయాళ, హిందీ భాషల్లో కూడా చాలా సినిమాలు చేశారు. తెలుగులో మాత్రం డబ్బింగ్ సినిమాలతోనే ఎక్కువగా అభిమానులను ఆయన సాధించారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. 1983లో వచ్చిన 'అంధా కానూన్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో హేమ మాలిని, అమితాబ్ బచ్చన్, రీనా రాయ్, ప్రేమ్ చోప్రా, డానీ, ప్రాణ్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు. 2.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 7.5 కోట్ల వ్యాపారం చేసింది.

66
రజినీకాంత్ సినిమాల్లో కొన్ని

రజినీకాంత్ మూండ్రు ముగం (1982), అంధా కానూన్ (1983), నల్లవనుక్కు నల్లవన్ (1984), గిరఫ్తార్ (1985), పడిక్కదవన్ (1985), మిస్టర్ భరత్ (1986), దోస్తీ దుష్మనీ (1986), వేలైక్కారన్ (1987), మనితన్ (1987), ధర్మతిన్ తలైవన్ (1988), కబాలి (2016), కాలా (2018), జైలర్ (2023), లాల్ సలామ్ (2024), కూలీ (2025) లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories