Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు

Published : Dec 12, 2025, 04:33 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 14వ వారం నామినేషన్‌లో ఉన్నవారికి పడుతున్న ఓటింగ్‌ ఆశ్చర్యకరంగా మారింది. టాప్‌ 5లో ఉంటారనుకున్న వాళ్లు డేంజర్‌ జోన్‌లో కనిపిస్తుండటం షాకిస్తుంది. 

PREV
15
14వ వారం లేటెస్ట్ ఓటింగ్‌ రిజల్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రియాలిటీ షో ముగింపుకు చేరుకుంది. ప్రస్తుతం 14వ వారం చివరికి చేరుకోగా, మరో వారంలో ఈ షో పూర్తి కాబోతుంది. ఇక టాప్‌ 5 ఎవరనేది ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ ఓటింగ్‌ లెక్కలు తారుమారు అవుతున్నాయి. టాప్‌ 5లో ఉంటారనుకున్న కంటెస్టెంట్లు డేంజర్‌లోకి వస్తున్నారు. ఎలిమినేట్‌ అవుతారనుకుంటున్న కంటెస్టెంట్లు సేఫ్‌లో కనిపిస్తున్నారు. మరోవైపు విన్నర్‌ ఎవరనే చర్చ కూడా బలంగా నడుస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. నెటిజన్లు, బిగ్‌ బాస్‌ లవర్స్  ఎవరికి వారు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగానే అనాధికారిక ఓటింగ్‌ ఆశ్చర్యకరమైన ఫలితాలను చూపిస్తోంది.

25
కళ్యాణ్‌ తప్ప మిగిలిన వారంతా నామినేషన్‌

బిగ్‌ బాస్‌ 14వ వారం కళ్యాణ్‌ పడాల తప్ప మిగిలిన వారంతా నామినేషన్‌లో ఉన్నారు. కళ్యాణ్‌ గత వారం టికెట్‌ టూ ఫినాలేలో ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎంపికైన విషయం తెలిసిందే. టాప్‌ 5లో ఉండాల్సిన మిగిలిన కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  రెండో ఫైనలిస్ట్ గా ఇమ్మాన్యుయెల్‌కి ఛాన్స్ ఉందని సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం నామినేషన్‌లో ఉన్న వారిలో టాప్‌లో ఎవరు ఉన్నారు? లీస్ట్ లో ఎవరు ఉన్నారు? డేంజర్లో ఎవరు ఉన్నారనేది చూస్తే. ఆసక్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి. టాప్‌ కంటెస్టెంట్‌ డేంజర్‌లో కనిపిస్తున్నారు.

35
టాప్‌లో ఉన్నది వీరే

బిగ్‌ బాస్‌ తెలుగు 9 14వ వారం టాప్‌లో తనూజ ఉంది. ఆమెకి భారీ ఓటింగ్‌ పడుతుంది. ఆమెకి దాదాపు 30శాతం ఓటింగ్‌ నమోదు కావడం విశేషం. ఆ తర్వాత డీమాన్‌ పవన్‌ ఉన్నాడు. డేంజర్‌లో ఉంటాడనుకున్న పవన్‌ ఇప్పుడు టాప్‌ 2లోకి వచ్చాడు. ఆయనకు దాదాపు 17శాతం ఓటింగ్‌ రావడం విశేషం. రీతూ చౌదరీ మొత్తం డీమాన్‌ పవన్‌కి పనిచేస్తుందని తెలుస్తోంది. ఇక డేంజర్‌లో ఉంటుందనుకున్న సంజనాకి కూడా మంచి ఓటింగ్‌ పడుతుంది. దాదాపు 15శాతం ఓట్లు పడటం విశేషం. ఇక టాప్‌ 5లో ఉంటాడునుకున్న ఇమ్మాన్యుయెల్‌కి ఓటింగ్‌ తేడా కొడుతుంది. ఆయనకు 14శాతం మాత్రమే పడింది. అయితే సంజనాకి, ఇమ్మూకి మధ్య కొద్దిపాటి మాత్రమే ఓట్ల తేడా ఉంది.

45
ఓటింగ్‌ తలక్రిందులు

వీరితోపాటు టాప్‌ 5లో ఉంటాడనుకున్న భరణికి కూడా తక్కువ ఓట్లే పడ్డాయి. నాగబాబు రికమండేషన్‌తో మళ్లీ హౌజ్‌లోకి వచ్చిన ఆయన టాప్‌ 5లో ఉంటాడని ఆ మధ్య నాగార్జున తెలిపారు. దీంతో ఆయనకు తిరుగులేదని అంతా భావించారు. కానీ ఆయనకు 13-14శాతం మధ్య ఓటింగ్‌ పడిందని తెలుస్తోంది. అలాగే ఒకప్పుడు టాప్‌ లో ఉన్న సుమన్‌ శెట్టి కూడా ఈ సారి లీస్ట్ లో ఉన్నారు.  గతంలోనే ఎలిమినేట్‌ అవుతున్నారనుకున్న సుమన్‌ శెట్టికి అనధికారిక ఓటింగ్‌ లెక్కల ప్రకారం తక్కువ ఓట్ల పడ్డాయి. ఆయనకు పదిశాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైనట్టు తెలుస్తోంది. ఈ లెక్కన మరోసారి సుమన్‌ శెట్టి   డేంజర్‌లోనే ఉన్నారు. అయితే అధికారిక ఓటింగ్‌లో మాత్రం సుమన్‌ శెట్టికి గట్టిగా ఓటింగ్‌ పడుతుండటం విశేషం. మరి ఈ సారి కూడా ఆయనకు బాగానే పడ్డాయా? డేంజర్‌లో ఉన్నాడా? అనేది ఈ శనివారంతో క్లారిటీ రానుంది.

55
డేంజర్‌లో ఈ ముగ్గురు కంటెస్టెంట్లు

మొత్తంగా 14వ వారం తనూజ, డీమాన్‌ పవన్‌, సంజనా సేఫ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇమ్మాన్యుయెల్‌, భరణి, సుమన్ శెట్టి డేంజర్‌లో ఉన్నారు. వీరిలోనే ఎలిమినేషన్‌ ఉండబోతుంది. అయితే ఈ వారం ఫైనలిస్ట్ ల ఎంపిక జరుగుతుంది. దీని ప్రకారం ఫైనల్‌ కాని వారు ఎలిమినేట్‌ అవుతారు. ఈ ప్రాసెస్‌ శనివారం ఎపిసోడ్‌ నుంచే స్టార్ట్ అవుతుంది. దీంతో ఇప్పుడు బిగ్‌ బాస్‌ షో మరింత రసవత్తరంగా మారింది. ఎవరు టాప్‌ 5లో ఉంటారనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది. మరి  ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరనేది  చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories