షర్ట్ మార్చితే లక్ష రూపాయలు ఇస్తా, చిరంజీవిని చూసి వణికిపోయిన రజినీకాంత్.. కెమెరామెన్ తో ఓపెన్ గా..

Published : Jun 26, 2025, 07:31 AM IST

రజినీకాంత్ బాబా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఓ ఇంటర్వ్యూలో వివరించారు.చిత్ర షూటింగ్ సమయంలో రజినీకాంత్ మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.

PREV
15
బాబా షూటింగ్ లో జరిగిన సంఘటన 

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలో రజినీకాంత్ కి ఉండే స్టైల్, మేనరిజమ్స్ ఇంకెవరికి సాధ్యం కావు. అందుకే రజినీకాంత్ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. భాషలకి అతీతంగా రజనీకాంత్ చిత్రాలు దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. 

ఒక దశలో రజినీకాంత్ ఇండియన్ సినిమాలోని అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగా చాలా కాలం కొనసాగారు. రజినీకాంత్ బాబా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో రజినీకాంత్ మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.

25
రజినీ షర్ట్ మార్చితే లక్ష రూపాయలు ఇస్తా

బాబా షూటింగ్ సమయంలో రజినీకాంత్ వల్ల చిన్నపాటి మనస్థాపానికి గురయ్యానని చోటా కె నాయుడు తెలిపారు. ఆ తర్వాత ఆయనే ఫోన్ చేసి సారీ చెబుతూ చిరంజీవి గురించి చెప్పిన మాటలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోయాయని చోటా కె నాయుడు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాబా షూటింగ్ జరుగుతున్నప్పుడు మేమంతా సాంగ్ షూట్ కోసం రెడీ అవుతున్నాం. తరుణ్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ షూటింగ్ మొదలైంది.

సమ్మర్ లో షూటింగ్ కావడంతో రజినీకాంత్ ధరించిన షర్ట్ చెమటతో నిండిపోయింది. దీంతో తాను తరుణ్ మాస్టర్ కి చెప్పి రజినీకాంత్ గారి షర్ట్ మార్పించమని చెప్పాను. కానీ తరుణ్ మాస్టర్ ఒప్పుకోలేదు. లేనిపోని గొడవెందుకు అలాగే షూట్ చెయ్ అని తరుణ్ మాస్టర్ చెప్పారు. షర్టు పాడైపోయి ఉంటే ఎలా షూట్ చేయాలి మార్పించమని మళ్లీ అడిగాను. ఆ పని నేను చేయలేను.. ఒకవేళ నువ్వు రజినీ సార్ చేత షర్ట్ మారిస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తా అని తరుణ్ మాస్టర్ అన్నారు.

35
అందరి ముందు పరువు పోయింది

రజినీ సార్ నేను చెప్తే కాదనరు కదా అనే ధీమాతో వెళ్లి అడిగాను. సార్ మీ షర్ట్ మార్చాలి అని అడిగాను. ఆయన వెంటనే నో.. షర్ట్ మార్చడం ఎందుకు, ఇదే చాలు వెళ్లి షూట్ చెయ్ అని గట్టిగా అరిచారు. అక్కడ అందరూ ఉండడంతో నా పరువు పోయినట్లు అయింది. సాంగ్ ని బాగా షూట్ చేయాలి అనే ఆసక్తి పోయింది. ఈవినింగ్ ప్యాకప్ అయ్యాక హోటల్ కి వెళ్ళిపోయా. రజినీ సార్ స్టే చేసే హోటల్లోనే నాకు కూడా రూమ్ ఇచ్చారు.

45
రజినీ నుంచి ఫోన్

షూట్ అయిన వెంటనే రజినీ సార్ నాకు డ్రింక్ పంపారు. ఆ తర్వాత రజినీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాకు మాట్లాడటం ఇష్టం లేక నిద్రపోతున్నట్లు చెప్పమని నా అసిస్టెంట్ కి చెప్పాను. రజినీ సార్ వెంటనే చోటా నీకు నిద్రపోతున్నట్లు చెప్పమన్నాడా? అతడు మేల్కొనే ఉన్నాడు నాకు తెలుసు వెళ్లి ఫోన్ ఇవ్వు అని రజినీ సార్ అన్నారు. ఆయన నాలాంటి ముదురులని ఎంతమందిని చూసి ఉంటాడో కదా అని చోటా కె నాయుడు తెలిపారు.

55
చిరంజీవి, కమల్ హాసన్ డ్యాన్స్ పై కామెంట్స్

ఫోన్ తీసుకుని మాట్లాడితే.. ఆయన షూటింగ్ లో జరిగిన సంఘటనకి సారీ చెప్పారు. తాను ఎందుకు గట్టిగా అరవాల్సి వచ్చిందో కూడా తెలిపారు. నాకు సాంగ్ షూటింగ్ అంటే కెరీర్ బిగినింగ్ నుంచి షివరింగ్ వస్తుంది. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి అద్భుతంగా డ్యాన్స్ చేసేవాడు. మరోవైపు కమల్ హాసన్ క్లాసిక్ డ్యాన్స్ అదరగొట్టేవారు. వీళ్ళిద్దరూ అంత అద్భుతంగా డ్యాన్స్ తో అలరిస్తుంటే నాకు మాత్రం అసలు వచ్చేది కాదు. అందుకే సాంగ్ షూటింగ్ అంటేనే భయం వేస్తుంది.

నేను టెన్షన్ లో ఉన్నప్పుడు నువ్వు షర్ట్ మార్చమనే సరికి అలా రియాక్ట్ అయ్యాను అని రజినీ చెప్పినట్లు చోటా కె నాయుడు తెలిపారు. సాంగ్ షూటింగ్ సమయంలో ఇతర విషయాలేవీ తాను పట్టించుకోనని రజినీకాంత్ చెప్పారట.

Read more Photos on
click me!

Recommended Stories