పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, హరిహర వీరమల్లు ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

Published : Jun 25, 2025, 11:34 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. త్వరలో హరిహర వీరమల్లు సినిమా నుంచి ట్రైలర్ సందడి చేయబోతోంది. అందుకోసం డేట్ ను లాక్ చేసేపనిలో ఉన్నారు మూవీ టీమ్. ఇంతకీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే? 

PREV
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, హరిహర వీరమల్లు. ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి, రిలీజ్ దశలోకి చేరుకుంటోంది. ఈసినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, జ్యోతి కృష్ణ స్క్రీన్‌ప్లే రచించారు. క్రిష్ ఈసినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అన్ని పనులు చూసుకుంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల దాదాపు ఐదేళ్ల పాటు ఆలస్యమైంది.

26

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల దాదాపు ఐదేళ్ల పాటు ఆలస్యమైంది. 2019లోనే ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ, కరోనా మహమ్మారి, పవన్ పొలిటికల్ బిజీ, షూటింగ్ లో తడబాటులు వంటి అంశాలతో సినిమా లేట్ అయ్యింది. ఇక ఈసినిమాకు సంబంధించి తాజా సమాచారం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ పై భారీ అంచనాల మధ్య మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

36

ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లు ట్రైలర్‌కు సంబంధించిన ఫైనల్ కట్‌ను మేకర్స్ రీసెంట్ గా లాక్ చేశారు. ఈ వారంలోనే అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైలర్‌ను ఈ వీకెండ్‌లో లేదా వచ్చే వారం స్టార్టింగ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

ఈ ట్రైలర్‌పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులలో కూడా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. సినిమాకు సంబంధించి రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. కానీ అసలు కథా స్క్రీన్ ప్లే, విజువల్ ప్రెజెంటేషన్ ఎలా ఉండబోతున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వడంలో ట్రైలర్‌దే కీలక పాత్ర.

46

హరిహర వీరమల్లు సినిమాని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. సినిమా చారిత్రక నేపథ్యంలో సాగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ యూనిట్ హింట్ ఇచ్చింది. 17వ శతాబ్దం మొగలాయిల కాలంలో ఓ రాజకీయ పోరాటయోధుడిగా ఆయన పాత్ర ఉంటుందన్న అంచనాలున్నాయి.

56

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని కొన్ని విభిన్నమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోందని మేకర్స్ చెబుతున్నారు. అలాగే ఆస్కార్ అవార్డ్ గ్రహీత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం మరో హైలైట్‌.

66

ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ట్రైలర్ విడుదల అనంతరం సినిమా విడుదల తేదీపై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లు ఎలా ఉంటాయన్నది చూడాల్సిన అంశం. కానీ ట్రైలర్ విడుదలతో సినిమా హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి పవన్ ప్రమోషన్స్ కు వస్తారా లేదా అనేది కూడా చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories