రజనీకాంత్‌ ఎడిటింగ్‌ చేయడం వల్లే ఆ సినిమా డిజాస్టర్‌, నా కెరీరే నాశనం, స్టార్‌ డైరెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

First Published | Oct 8, 2024, 8:59 AM IST

రజనీ కాంత్ హీరోగా నటించిన వెట్టయన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారమే అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. 

Rajanikanth, anushka shetty, Linga,

స్టార్స్ తమ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఎడిటింగ్ టేబుల్ దగ్గరే తిష్టవేస్తూంటారు. ఇది చాలా మంది డైరక్టర్స్ కంప్లైంట్. అయితే ఆ డైరక్టర్స్ మీడియా ముందుకు వచ్చి చెప్పలేరు. ఆ స్టార్స్ తో తమకు ఉన్న రిలేషన్ దెబ్బ తింటుందని భయం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

అదే సమయంలో ఆ హీరో అభిమానులు కూడా సోషల్ మీడియాలో దాడి చేస్తారని తెలుసు. అయితే అన్నిటికి తెగించి  ఓ డైరక్టర్ బయిటకు వచ్చి ఆ విషయాలు చెప్పుకుంటున్నారంటే ఆ షూట్ సమయంలో తాను ఎంత  పెయిన్ అనుభవించాడో తెలుసుకోవచ్చు.  స్టార్ తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ ..ఇప్పుడు అలాగే రజనీతో తన చేదు అనుభవాలు చెప్పుకొచ్చారు.

Rajinikanth, rajanikanth, chennai, hospital

సౌతిండియా సూపర్ స్టార్  రజినీకాంత్ కెరీర్‌లో ‘లింగ’ ఓ డిజాస్టర్‌ సినిమాగా నిలిచిన సంగతి తెలసిందే. పదేళ్ల క్రితం  2014లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి.  ఆశించిన స్థాయిలో కలెక్షన్లను దక్కించుకోలేదు. ఈ మూవీకి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు.

రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ వర్కవుట్ కాలేదు. ఇన్నాళ్లకు , లింగ సినిమా ఫెయిల్యూర్ పై దర్శకుడు రవికుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం ప్లాఫ్ అయ్యేందుకు రజినీకాంతే కారణం అనేలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు.
 


Superstar rajanikanth

k.S. రవి కుమార్ మాట్లాడుతూ..."లింగా ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. సీజేఐ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌) చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు" అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

అలాగే లింగ చిత్రంలో ఓ ఫైట్‍లో బ్రిడ్జి మీద నుంచి హాట్ ఎయిర్ బెలూన్‍పైకి రజినీకాంత్ జంప్ చేస్తారు. ఈ సీన్‍పై ట్రోల్స్ బాగా వచ్చాయి. అయితే, ఆ బెలూన్ ఐడియా రజినీకాంత్‍దే అన్నట్టుగా రవికుమార్ వెల్లడించారు. ఆ సీన్ తన కెరీర్‌ను నాశనం చేసిందని అన్నారు. లింగ చిత్రాన్ని ఆ ఆర్టిఫిషియల్ బెలూన్ జంప్ సీన్ పూర్తిగా చెడగొట్టిందని చెప్పుకొచ్చారు.

Rajanikanth

లింగ చిత్రంలో రజినీకాంత్ డ్యుయల్ రోల్స్ చేశారు. లింగేశ్వరన్, రాజా లింగేశ్వరన్ అంటూ రెండో పాత్రల్లో కనిపించారు. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు, కే విశ్వనాథ్, సంతానం, కరుణాకరన్, బ్రహ్మానందం, దేవ్ గిల్, రాధా రవి ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు.

లింగ చిత్రాన్ని రాక్‍లైన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై వెంకటేశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రంతో డైరెక్టర్ కేఎస్ రవికుమార్‌పై విమర్శలు వచ్చాయి. అయితే, మరీ డిజాస్టర్ కాకుండా దాదాపు సుమారు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ఈ చిత్రం దక్కించుకోగలిగింది. తెలుగులోనూ ఈ మూవీకి పెద్దగా వసూళ్లు రాలేదు.

Rajanikanth

 రజనీ కాంత్ హీరోగా నటించిన వెట్టయన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారమే అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ కామెంట్స్ షాకింగ్ గా మారాయి. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ యాక్టర్లు కూడా ఈ మూవీలో నటించారు. టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లోకేేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి చిత్రం కూడా రజినీకాంత్ చేస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

Latest Videos

click me!