రాజేంద్రప్రసాద్ ఇటీవల `పుష్ప 2` సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఎర్రచందనం దొంగ హీరోనా అంటూ సెటైర్లు పేల్చాడు. ఆ తర్వాత బన్నీ తనకు కొడుకు లాంటివాడంటూ ఆయన కవర్ చేసుకున్నారు. ఈ క్రమంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఆయన హీరోయిన్‌కి సినిమా అవకాశం రాకుండా చేశాడట. ఆఫర్ ఇవ్వకుండా అడ్డుకున్నాడట.
అలనాటి తెలుగు హీరోయిన్లలో దివ్యవాణి ఒకరు. ఆమె తెలుగు ట్రెడిషన్‌కి పెద్ద పీఠ వేస్తూ సినిమాలు చేశారు. ఆమె ఏ మూవీ చేసినా అందులో కుందనపు బొమ్మలా ముస్తాబై అలరించింది. తెలుగు దనాన్ని వెండితెరపై ఆవిష్కరించింది. తెనాలి అమ్మాయి అయిన దివ్యవాణి `సర్దార్ కృష్ణమనాయుడు` సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోలతో మూవీస్ చేసి మెప్పించింది.
read more:వెంకటేష్ హీరో కాకపోతే ఏం చేసేవాడో తెలుసా? వెంకీమామ అసలు డ్రీమ్ ఇదే!
కృష్ణ, చిరంజీవి, రాజేందప్రసాద్ వంటి వారితోనూ కలిసి నటించారు. అయితే ఆమె ఎక్కువగా రాజేంద్రప్రసాద్‌తో చేసింది. `ముత్యమంత ముద్దు` సినిమాలో రాజేంద్రప్రసాద్‌తో కలిసి చేసింది. ఇందులో ఆయనకు జోడీగా కాకపోయినా కీలక పాత్రలో మెరిసింది.
`ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్` చిత్రంలో ఆయనకు జోడీగా చేసింది. `ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం`, `పెళ్లి పుస్తకం`, `లేడీస్ స్పెషల్` చిత్రాలు వరుసగా రాజేంద్రప్రసాద్‌తో చేసింది దివ్యవాణి. ఈ ఇద్దరు జోడీకి మంచి క్రేజ్ వచ్చింది. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా పండింది.
అయితే మరో సూపర్ హిట్ మూవీ వీరిద్దరి కాంబోలో రావాల్సింది. అదే `మిస్టర్ పెళ్లాం`. బాపు రమణలు రూపొందించిన చిత్రమిది. రాజేంద్రప్రసాద్ హీరో. ఇందులో దివ్యవాణి హీరోయిన్‌గా చేయాల్సింది. కానీ ఆమెని కాదని ఆమనిని తీసుకున్నారు. దీనిపై పెద్ద రచ్చ అయ్యిందట.
రాజేంద్రప్రసాద్ కాదంటే కాదు అన్నారట. ఆయనకు సారీ కూడా చెప్పారట. అయినా వినలేదట. కావాలని ఈ ఆఫర్ ఆమెకి రాకుండా అడ్డుకున్నాడట రాజేంద్రప్రసాద్. అది తనని చాలా బాధ పెట్టిందని చెప్పింది దివ్యవాణి. ఆయన వేరే ఆలోచనలో ఉండేవాడని దివ్యవాణి చెప్పడం షాకిస్తుంది.
also read: టికెట్ రేట్లు పెంచడం వల్లే రికార్డులు బ్రేక్.. `పుష్ప 2` కలెక్షన్లపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఆమె ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది. రాజేంద్రప్రసాద్ వల్లే ఆ సినిమా చేయలేకపోయానని, ఆయనే అడ్డుకున్నాడని బోల్డ్ గా వెల్లడించింది. మరి ఆయన నో చెప్పడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇందులో క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది దివ్యవాణి. ఆ సమయంలో కూడా ఇది ఉండేదని, తన వెంట ఎప్పుడూ అమ్మ ఉండేదని, తనని రక్షించిందని చెప్పింది. హోటల్ రూమ్‌ల్లో స్టోరీ డిస్కషన్స్ జరిగేవని, ఆడిషన్‌కి వెళ్లితే, కిందకు పైకి చూసి వొడ్డు పొడువు బాగుందని అనేవారట.
ఆ తర్వాత అమ్మని బయటకు వెళ్లిపోమ్మనేవారట. అప్పుడే తనకు సీన్ అర్థమైపోయేదని, ఇక అక్కడి నుంచి వెళ్లిపోయేవాళ్లమని, ఇలా అమ్మనే తనని చాలా సార్లు సేవ్ చేసిందని దివ్యవాణి చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది.
రాజేంద్రప్రసాద్ తనకు ఆఫర్ రాకుండా చేయడానికి ఇదేమైనా కారణమా? అనే అనుమానాలకు తావిస్తుంది. ప్రస్తుతం దివ్యవాణి కామెంట్లు నెట్టింట రచ్చ అవుతున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత నుంచి వీరిద్దరు కలిసి నటించలేదు. ఆ గ్యాప్ అలానే ఉండిపోయింది.
read more: చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా తప్పుకోవడానికి కారణం ఏంటి? సీనియర్ నటుడు చెప్పిన పచ్చి నిజాలు