చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా తప్పుకోవడానికి కారణం ఏంటి? సీనియర్‌ నటుడు చెప్పిన పచ్చి నిజాలు

First Published | Dec 30, 2024, 7:43 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా ఒప్పుకున్నారు, కానీ తప్పుకోవడానికి కారణమేంటి? సీనియర్‌ నటుడు చెప్పిన షాకింగ్‌ నిజాలు. 
 

టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరనేదానిపై చాలా కాలంగా చర్చ నడుస్తుంది. ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరించేవారు. ఆయన చెప్పింది అంతా వినేవారు. దర్శక, నిర్మాతల సమస్యలు కూడా ఆయన వద్దకు వెళ్లేవి. ఆర్టిస్టుల సమస్యలను కూడా పరిష్కరించేవారు.

హుందాతనంతో వ్యవహరిస్తూ పెద్దగా వ్యవహరించేవారు. ఆయన అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడు కావడం, ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను ఇండస్ట్రీకి అందించడం, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కావడం వల్లే ఆయనకు అంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. 
 

పైగా కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీకి పెద్దగా అన్ని అర్హతలున్నాయని అంతా భావించేవారు. ఆయనకు నో చెప్పిన వాళ్లు లేరు. కానీ ఆయన చనిపోవడంతో నెక్ట్స్ ఎవరు ఆ స్థానం తీసుకుంటారనేది పెద్ద ప్రశ్న. చాలా కాలంగా ఎలాంటి సమాధానం లేకుండా సాగింది.

కానీ ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవికి ఆ అర్హత ఉందనే వాదన ప్రారంభమైంది. ఆయన అత్యధిక సినిమాలు చేసిన హీరోగా, సక్సెస్‌ఫుల్‌ మాస్‌ హీరోగా, మెగాస్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరోగా రాణించారు. రాణిస్తున్నారు. పైగా కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అన్ని విభాగాల్లోనూ టాలెంట్‌ ఉన్న స్టార్‌. అందుకే ఆయన్ని ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని చాలా మంది కోరుకున్నారు. 

read  more: టికెట్‌ రేట్లు పెంచడం వల్లే రికార్డులు బ్రేక్‌.. `పుష్ప 2` కలెక్షన్లపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు


అప్పట్లో సూపర్‌ స్టార్‌ కృష్ణ, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వంటి దిగ్గజాలు ఉన్నా, వాళ్లు యాక్టివ్‌గా లేరు. మోహన్‌బాబు సక్సెస్‌ఫుల్‌గా లేరు. సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ లు చిరుకి సమకాలీకులుగా ఉన్నా, ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించేంత స్థాయిలో వాళ్లు లేరనే భావన ఉండేది.

పైగా వారంతా ప్రైవేట్‌ లైఫ్‌కే ప్రయారిటీ ఇస్తుంటారు. చిరంజీవిలా అన్ని విషయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు. అందుకే చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించాలనేది చాలా మంది అభిప్రాయం. సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ ఇదే విషయాన్ని చిరంజీవి ముందు ఉంచారు. కొంత మంది పెద్దలతో కలిసి ఈ విషయాన్ని ఆయనతో చర్చించారట. అందుకు చిరంజీవి కూడా ఒప్పుకున్నారట. 

Chiranjeevi, ntr, mohan babu, Kondaveeti Simham

కొంత కాలం ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించారు చిరంజీవి. సమస్యలను సాల్వ్ చేయడంలో, ఇండస్ట్రీకి రిప్రజెంట్‌ చేసే విషయంలోనూ ఆయన కాస్త ముందున్నారు. కానీ ఆయన పెద్దరికాన్ని కొందరు సహించలేకపోయారు. మాకేం తక్కువ అనే మాట వినిపించింది. ముఖ్యంగా `మా` ఎన్నికల సమయంలో ఇది పెద్ద రచ్చ అయ్యింది. మోహన్‌బాబు, మంచు విష్ణు, నరేష్‌ టీమ్‌.. చిరంజీవి టార్గెట్‌ చేస్తూ కామెంట్లు చేశారు.

ఆయన్ని తక్కువ చేసి మాట్లాడారు. ఇంకోవైపు ఓ ప్రెస్‌ మీట్‌లో రాజశేఖర్‌ కూడా నోరు జారారు. ఇలా కొందరు చిరంజీవి పెద్దరికాన్ని తీసుకోలేకపోయారు. అది మెగాస్టార్‌కి నచ్చలేదు. `మా` ఎన్నికల తర్వాత ఆయనే ప్రకటించారు, ఇండస్ట్రీకి పెద్దగా కాదు, ఇండస్ట్రీకి బిడ్డగా ఉంటాను, ఏ సహాయం కావాలన్నా చేస్తానని తెలిపారు. 

also read: అల్లు అర్జున్ ఒక్కడినే తప్పుపట్టలేం, గతంలో చిరంజీవి గారు ఎలా చేశారంటే.. సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి పవన్

అన్నట్టుగానే ఏపీ ప్రభుత్వంతో టికెట్‌ రేట్లు విషయంలో, ఎక్కువ షోస్‌ ల విషయంలో నెలకొన్న వివాదాన్ని సాల్వ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. సీఎం జగన్‌కి దెండం పెట్టి ట్రోల్‌కి గురయ్యాడు. అయినా ఎవరు ఏమనుకున్నా మా దృష్టిలో చిరంజీవినే ఇండస్ట్రీ పెద్ద అని ప్రకటించారు రాజమౌళి. అయితే తాజాగా దీనిపై సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ స్పందించారు.

ఇటీవల అల్లు అర్జున్‌ వివాదం, తెలంగాణ ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల నేపథ్యంలో ఈ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. చిరంజీవి ఎందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకి స్పందిస్తూ తాను ఇలానే ఒకప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించాలని చెప్పానని, ఆయన ఒప్పుకున్నారని, కానీ కొన్ని పరిణామాలతో ఆయన వెనక్కితగ్గారని, ఎక్కడో ఆయన మనసు గుచ్చుకుందని అందుకే దూరంగా ఉంటున్నారని తెలిపారు మురళీ మోహన్‌. 
 

అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కమిట్‌మెంట్‌ లేదని, ఒకప్పుడు అంతా ఒక కమిట్‌మెంట్‌తో ఉండేవాళ్లమని చెప్పారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా ఒక గూడుపై ఉన్నట్టుగా ఉండేదని, కానీ ఇప్పుడు అలా లేదని, స్వేచ్ఛ ఎక్కువైందని, మీరేంటి చెప్పేది అనేలా మారిపోయిందని, ఎవరికివాళ్లు పెద్దగా భావిస్తున్నారని, ఈ పరిణామాల నేపథ్యంలోనే చిరంజీవి సైలెంట్‌ అయ్యారని తెలిపారు మురళీ మోహన్‌. ఇండస్ట్రీకి పెద్దగా అయితే ఆయనే కరెక్ట్ అని, ఆయనకు ఆ అర్హత ఉందని మురళీ మోహన్‌ చెప్పడం విశేషం. 

read more: వెంకటేష్‌ హీరో కాకపోతే ఏం చేసేవాడో తెలుసా? వెంకీమామ అసలు డ్రీమ్‌ ఇదే!

Latest Videos

click me!