గాలి సంపత్‌ ప్రీమియర్‌ షో రిపోర్ట్ .. ఏమంటున్నారంటే?

First Published Mar 11, 2021, 9:45 AM IST

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, హీరో శ్రీవిష్ణు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `గాలిసంపత్‌` ప్రీమియర్‌ షో ముగిసింది. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ రోలర్‌ కోస్టర్‌ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి అందించారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయనే చేశారు. దీంతో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఎలా టాక్‌ ఉందనేది చూస్తే.. 

శ్రీవిష్ణు డిఫరెంట్‌ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సపరేట్‌ గుర్తింపుని తెచ్చుకున్నారు. రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలకు అతీతంగా ఆయన సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరగా నటించిన `తిప్పరమీసం` పరాజయం చెందింది. దీంతో `గాలిసంపత్‌`పై హోప్స్ పెట్టుకున్నారు. మరోవైపు రాజేంద్రప్రసాద్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత్ర ఏదైనా పండించడం, రక్తికట్టించడం ఆయను వెన్నతో పెట్టిన విద్య. మరి ఈ సినిమాలో ఎలా చేశారు, అనిల్‌ రావిపూడి పర్యవేక్షణ ఎంత వరకు వర్కౌట్‌ అయ్యిందనేది చూస్తే..
undefined
`గాలిసంపత్‌` కథ గురించి చూస్తే, రాజేంద్రప్రసాద్‌ రేడియో ఆర్టిస్ట్‌. ఆయనకు నాటకాలంటే ఇష్టం. ఓ ప్రమాదంలో తన గొంతుని కోల్పోతాడు. `ఫా.. ఫా.. ఫి.. ఫి` లాంగ్వేజ్‌ మాట్లాడుతుంటాడు. ఆయనకు సత్య ట్రాన్స్ లేటర్‌గా వ్యవహరిస్తుంటాడు. తన భార్య కూడా మరణం చెందడంతో కొడుకు శ్రీవిష్ణు కోసం జీవిస్తుంటారు. అరకులో ట్రక్కు కొనుక్కుని జీవించాలని శ్రీవిష్ణు ఆశయం. దీంతోపాటు ఆ ఊరు సర్పంచ్‌ కూతురుని ప్రేమించిన ఆయన ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మని ఆయన కల నెరవేరిందా అనేది కథ. ఇందులో శ్రీవిష్ణుకి ఏం జరిగిందనేది ఆసక్తికరం. క్లుప్తంగా కథ ఇది.
undefined
సినిమా తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ప్రధానంగా సాగుతుంది. తండ్రి కొడుకులకు లక్ష్యాలుంటాయి. తండ్రి స్టేట్‌ ఆర్టిస్టుగా రాణించాలనుకుంటాడు. కొడుకు ట్రక్కు కొనుక్కుని, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుని మెమరబుల్‌ లైఫ్‌ని గడపాలనుకుంటాడు. వారి లక్ష్యాల కోసం సాగిన జర్నీలో చోటు చేసుకున్న పదనిసలు, ఆటుపోట్లు, ఆడ్డంకులు, వాటిని వీరు ఎలా అధిగమించారు. ఈ క్రమంలో వీరి ఎలా స్ట్రగుల్‌ అయ్యారనే అంశాలు ఆకట్టుకునేలా ఉన్నా.. వాటిని సరిగా డీల్‌ చేయలేదనే కామెంట్‌ వినిపిస్తుంది.
undefined
అనిల్‌ రావిపూడి ఫ్యాన్స్ కిది బాగా నచ్చిందట. రాజేంద్రప్రసాద్‌ `ఫా.. ఫా.. ఫి.. ఫి` లాంగ్వేజ్‌ కామెడీని పంచినా, ఆ తర్వాత అది బోరింగ్‌ గా ఉందని అంటున్నారు. అదే సమయంలో రాజేంద్రప్రసాద్‌ మరోసారి అద్భుతమైన నటన ప్రదర్శించారని ప్రీమియర్‌ చూసిన వారు కామెంట్‌ చేస్తున్నారు. సినిమా బొమ్మ బ్లాక్‌ బస్టర్‌, ఎక్స్ లెంట్‌ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మంచి రోలర్‌ కోస్టర్‌ సినిమా అని, సరదాగా నవ్వుకునే చిత్రమని ప్రీమియర్‌ చూసిన కొందరు అంటున్నారు. అనిల్ రావిపూడి సమర్పణ, స్క్రీన్ ప్లే, మాటలు లాంటి అంశాలు చూస్తే గాలి సంపత్‌ ఓ భావోద్వేగమైన కథగా కనిపిస్తుందంటున్నారు.
undefined
అదే సమయంలో బలమైన కథ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత సేపు రాజేంద్రప్రసాద్‌ ఫా ఫా లాంగ్వేజ్‌, తప్ప అందులో చెప్పుకోదగ్గ అంశాలు లేవని అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. అనిల్‌ రావిపూడి అన్నీ తానై చేసిన ఈ సినిమా సీన్లతో నడిపించారని అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ తన వంతు న్యాయంగా గాలి సంపత్‌ పాత్రని మరో రేంజ్‌కు తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ కథ, కథనాల్లో బలం లేకపోవడంతో ఆయన సన్నివేశాలు తేలిపోయాయని అంటున్నారు. సెకండాఫ్‌లో కొద్ది నిమిషాల ముందు తన నటనా ప్రతిభను మరోసారి రుచి చూపించడం కాస్త ఊరటగా కనిపిస్తుంది.
undefined
సత్య పాత్ర మొదట్లో నవ్వించినా, అది విసిగించేలా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. శ్రీవిష్ణు సైతం అంతగా మెప్పించలేకపోయిందని చాలా మంది నుంచి వినిపిస్తుంది. రాజేంద్రప్రసాద్‌కి వర్షం పడకపోవడం, ఇంటర్వెల్‌ సమయంలో ఆయన బావిలో పడటం సన్నివేశాలు అంతగా రక్తికట్టించేలా లేవని అంటున్నారు. ఇక శ్రీవిష్ణు లవ్‌ స్టోరీ కూడా తేలిపోయిందనే టాక్‌ వినిపిస్తుంది.
undefined
టోటల్‌గా రొటీన్‌ స్టోరీగా, రొటీన్‌ కామెడీగా ఈ సినిమా మిగిలిందని ప్రధానంగా వినిపిస్తున్న మాట. అనిల్‌ రావిపూడి మార్క్ మ్యాజిక్‌ ఇందులో కనిపించలేదని, పైగా ఆయన ప్రతి సినిమాలో ఓ పాత్రకి ఏదో లోపం పెట్టడం పరిపాటిగా మారిందని, కానీ అది బోరింగ్‌ సబ్జెక్ట్ గా ఉందని అంటున్నారు. సినిమా డిజాస్టర్‌ ఖాతాలో పడటం ఖాయమనే టాక్‌ ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమనేది మరికాసేపట్లో తేలిపోనుంది.
undefined
click me!