జాతిరత్నాలు యూఎస్ ప్రీమియర్ షో రివ్యూ

First Published Mar 11, 2021, 7:57 AM IST

మంచి బజ్ మధ్య విడుదలవుతున్న జాతిరత్నాలు చిత్రం యూఎస్ ప్రీమియర్ ఇప్పుడే ముగిసింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా, ఈ చిత్రానికే యూఎస్పీ అయిన కామెడీ ఎలా పండిందో చూద్దాము. 

చిట్టి పాట, ఆ తరువాత క్యూరియాసిటీని పెంచే ట్రైలర్ రిలీజ్ ల వల్ల చిన్న సినిమా అయినప్పటికీ... జాతిరత్నాలు చిత్రం మంథి బజ్ ని క్రియేట్ చేయగలిగింది. నవీన్ పోలిశెట్టి, ఫారియాఅబ్దుల్లా హీరో హీరోయిన్లుగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి మంచి టైమింగ్ ఉన్న కమెడియన్స్ ప్రధాన పాత్రధారులుగా కేవీఅనుదీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీనిప్రీమియర్ షో యూఎస్ లో పూర్తయింది. నాగ్ అశ్విన్ ప్రొడ్యూసర్ గా స్వప్న సినిమా బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం.
undefined
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సూపర్ హిట్ చిత్రం తో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిన నవీన్ పోలిశెట్టి... ఈ చిత్రంలో కూడా తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. రాహుల్, దర్శి, నవీన్ ల కామెడీ ట్రయో ఈ చిత్రానికి హైలైట్ గా ఉంది. జోగిపేట లో అల్లర చిల్లరగా బుడ్డర్ ఖాన్ వేషాలువేస్తూ గాలికి తిరిగే ఈ ముగ్గురు మంచి ఉద్యోగం సాధించి సమాజంలో ఇజ్జత్ సాధించాలని హైదరాబాద్ కి వస్తారు.
undefined
హైదరాబాద్ లో జాబ్ కోసం వెతుక్కుంటున్న ఈ ముగ్గురి జర్నీని డైరెక్టర్ చాలా హిలేరియస్ గా చూపించారు. శ్రీకాంత్(నవీన్ పోలిశెట్టి) కి ఉద్యోగం సంపాదించడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలోపల ఉద్యోగం సాధించకుంటే.... ఊరికి తిరిగివచ్చి తన తండ్రి లేడీస్ కార్నర్ షాపును చూసుకోవాల్సి ఉంటుంది. ఇంతలోనే శ్రీకాంత్... చిట్టి(ఫారియా అబ్దుల్లా) ను ఇంప్రెస్ చేయడానికి విశ్వ ప్రయత్నాలను సాగిస్తుంటాడు.
undefined
ఇక వీటి మధ్యలో తొలి ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయినా స్వతంత్ర దాదాపుగా దివాళా తీసే స్థాయికి వచ్చేస్తుంది. ఏదైనా అద్భుతం జరిగి ఈ కంపెనీ నిలబడితే బాగుండు అని ఆశించే దాని ఓనర్ శుభలేఖ సుధాకర్. ఇంతలోనే ఒక అనుకోని సంఘటన వల్ల నవీన్, రాహుల్, దర్శి లు ఒక కేసులో ఇరుక్కొని జైలుకెళ్తారు. ఇక్కడితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
undefined
ఇక సెకండ్ హాఫ్ ప్రారంభమవగానే... అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రహ్మి ఎంట్రీ సీన్. జడ్జిగా బ్రహ్మి ఎంటర్ అయినతరువాత కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. తెలంగాణ యాసలో సాగే పంచులు, దర్శి, రాహుల్, నవీన్ ల టైమింగ్ అన్ని కలిసి చాలా బాగా పండాయి. సెకండ్ హాఫ్ లో చిట్టి, శ్రీకాంత్ ల లవ్ స్టోరీని డైరెక్టర్ బాగానే తెరకెక్కించాడు.
undefined
ఈ నేరంలో తమ తప్పులేదని నిరూపించుకోవడానికి దర్శి, రాహుల్, నవీన్ లు చేసే ప్రయత్నాలు చాలా హిలేరియస్ గా ఉంటాయి. జడ్జి గా బ్రహ్మి టాప్ నాచ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ప్రెజంట్ క్రేజ్ కా బాప్ అయిన ఒక హీరో అలా కనబడి వెళతాడు. క్లైమాక్స్ సీన్స్ పూర్తిగా ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచెయ్యడం తథ్యం. సినిమా సాగుతున్నంత సేపు నవ్వుల లోకంలో ఆడియెన్స్ విహరిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ లో సాగే వన్ లైనర్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి.
undefined
click me!