సౌందర్య స్నానం చేసే సీన్, హీరోకి మైండ్ బ్లాక్..మహాతల్లి ఎక్కడుందో అంటూ చేతులెత్తి దండం పెట్టాడు

Published : Aug 04, 2025, 07:54 AM IST

రాజేంద్రుడు గజేంద్రుడు షూటింగ్ లో జరిగిన సంఘటనని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. సౌందర్య స్నానం చేసే సన్నివేశం గురించి ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
స్టార్ హీరోలకు సౌందర్య లక్కీ హీరోయిన్ 

అప్పట్లో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్ లాంటి హీరోలకు సౌందర్య లక్కీ హీరోయిన్ గా ఉండేవారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన చాలా చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. సౌందర్య, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మేడం లాంటి చిత్రాలు వచ్చాయి. రాజేంద్రుడు గజేంద్రుడు షూటింగ్ లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. 

DID YOU KNOW ?
ఏనుగు గురించి ముందే తెలుసుకున్నాం
రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో ఏనుగు ఎలాంటి సీన్లు చేయగలదు, ఎలాంటివి చేయలేదు అని ముందే తెలుసుకుని షూటింగ్ మొదలు పెట్టినట్లు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. షూటింగ్ మొత్తంలో తమకి ఏనుగు వల్ల చిన్న ఇబ్బంది కూడా కలగలేదని అన్నారు. 
25
కీలక పాత్రలో ఏనుగు 

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో ఏనుగు కీలక పాత్రలో నటించింది. బాగా ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగుని ఈ చిత్రం కోసం తీసుకున్నారు. ఏనుగు ఈ చిత్రంలో రియల్ గా అద్భుతంగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. 

35
సౌందర్య స్నానం చేసే సీన్, 5 టేకులు 

సౌందర్య, నాకు, ఏనుగుకి మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. నేను ఇంట్లో ఉంటాను. బయట సౌందర్య స్నానం చేసే సన్నివేశం అది. సౌందర్య స్నానం చేస్తుంటే నన్ను ఇరికించడానికి ఏనుగు ప్లాన్ వేస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా సౌందర్య బట్టలని కిటికీలో నుంచి నా దగ్గర పడేసి ఏనుగు వెళ్ళిపోతుంది. ఈ సన్నివేశాన్ని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గారు 5 సార్లు షూట్ చేశారు. ఏనుగు సరిగ్గా చేయకపోవడం కాదు.. అది 5 సార్లు చాలా పర్ఫెక్ట్ గా చెప్పినట్లు బట్టలు తీసుకువచ్చి కిటిలోనుంచి నా దగ్గర పెట్టింది. 

45
ఆ మహాతల్లి ఎక్కడ ఉందో.. 

కానీ కెమెరా యాంగిల్ సరిగ్గా లేకపోవడం, ఇతర డిస్ట్రబెన్స్ ఉండడం వల్ల 5 టేకులు పట్టింది అని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఆ ఏనుగు మాత్రం అద్భుతం. ఆ మహాతల్లి ఇప్పుడు ఎక్కడుందో తెలియదు అంటూ చేతులెత్తి దండం పెట్టారు. 

55
సీన్ అయిన ప్రతి సారీ.. 

షూటింగ్ లో ఏనుగుని మచ్చిక చేసుకోవడానికి దానికి చెరుకు గడలు తానే స్వయంగా తినిపించేవాడిని అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ విధంగా సీన్ అయిపోయిన ప్రతి సారీ ఏమైనా పెట్టమని నోరు తెరిచేది అని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories