14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ అయ్యింది. శేఖర్ బాషా రెండో వారం ఇంటిని వీడాడు. అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, సీత, నాగ మణికంఠ, మెహబూబ్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు.
ప్రస్తుతం హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 9వ వారానికి గాను యష్మి, టేస్టీ తేజ, హరి తేజ, నయని పావని, గౌతమ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఓటింగ్ సరళి రోజు రోజుకు మారిపోతుంది. నిన్న డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ నేడు ఒక స్థానం మెరుగు పరుచుకున్నారు. సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ డేంజర్ జోన్లోకి వెళ్లారు.
అందుతున్న సమాచారం ప్రకారం యష్మి గౌడ టాప్ లో కొనసాగుతున్నారు. ఏకంగా ఆమెకు 38 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందట. యష్మి గౌడ ఫస్ట్ వీక్ నుండి హౌస్ లో ఉంది. ఆమెకు ఇది కలిసొచ్చే అంశం. మిగతా నలుగురు వైల్డ్ కార్డు ఎంట్రీలు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు మించిన ఆదరణ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా వచ్చిన వారికి ఉంటుంది. వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారనే ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రేక్షకుల్లో ఉంటుంది.
Bigg boss telugu 8
యష్మి ఈ వారం పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ ఆమెకు అధిక మొత్తంలో ఓట్లు పోల్ కావడానికి ప్రధాన కారణం ఇదే. ఇక యష్మి తర్వాత రెండో స్థానంలో గౌతమ్ కొనసాగుతున్నాడట. ప్రేక్షకులు గౌతమ్ గేమ్ పట్ల సంతృప్తిగా ఉన్నారని ఓటింగ్ సరళి చూస్తే అర్థం అవుతుంది. గౌతమ్ కి అదృష్టం కూడా కలిసి వస్తుంది. అతడు 7వ వారం ఎలిమినేట్ కావాల్సింది. నాగ మణికంఠ అనారోగ్యం కారణంగా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. దాంతో గౌతమ్ సేఫ్ అయ్యాడు. ఆ వారం గౌతమ్ కి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయి.
Bigg boss telugu 8
సీజన్ 7లో పాల్గొన్న టేస్టీ తేజ వరుసగా సీజన్ 8లో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టేస్టీ తేజ మూడో స్థానంలో ఉన్నాడట. తన భారీ శరీరం కారణంగా టేస్టీ తేజ ఫిజికల్ టాస్క్ లలో ప్రభావం చూపడం లేదు. అయితే తన మాటలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అది టేస్టీ తేజకు కలిసొచ్చే అంశం. అలాగే కొంత పాపులారిటీ కలిగిన కంటెస్టెంట్.
కాగా చివరి రెండు స్థానాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు నయని పావని 4వ స్థానంలో హరి తేజ 5వ స్థానంలో ఉంది. ఒక రోజు వ్యవధిలో హరితేజ ఒక స్థానం మెరుగు పరుచుకుని నాలుగో స్థానంలోకి వచ్చిందట. డేంజర్ జోన్లోకి నయని పావని వెళ్లిందట. వీరిద్దరి మధ్య దాదాపు 5 శాతం ఓటింగ్ తేడా ఉందట. లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం నయని పావని ఎలిమినేట్ కానుంది.
నయని పావని సైతం సీజన్ 7 కంటెస్టెంట్. ఆమె గత సీజన్లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. కేవలం ఒక వారం హౌస్ ఉంది. హరితేజ విషయానికి వస్తే ఆమె సీజన్ 1 కంటెస్టెంట్. ఏకంగా టైటిల్ రేసులో నిలిచింది. ఆమెకు 3వ స్థానం దక్కింది. ఆ సీజన్ కి గాను శివ బాలాజీ విన్నర్ గా టైటిల్ కైవసం చేసుకున్నాడు. కాగా ఇవి అనధికారిక ఓటింగ్ ఫలితాలు మాత్రమే. స్టార్ మా అధికారిక ఫలితాలు తెలియజేయదు. శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ ముగుస్తుంది. ఓటింగ్ లో మార్పులు చోటు చేసుకోవచ్చు..