ఈరోజు ఎపిసోడ్లో వసుధార మినిస్టర్ తో ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార మిషన్ ఎడ్యుకేషన్ విషయంలో తన ప్లాన్లు వివరించడంతో వెరీ గుడ్ అని మెచ్చుకుంటారు మినిస్టర్. అప్పుడు రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా వసుధార చెప్పే మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు మినిస్టర్ రిషి వసుధార లాంటి తెలివైన అమ్మాయి దొరకడం మన అదృష్టం అలాంటి ఆమెను ఎప్పుడూ వదులుకోకు అంటాడు మినిస్టర్. అప్పుడు రిషి మనసులో తనే నన్ను వదులుకుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మినిస్టర్ నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు వసుధార నీకు మహేంద్ర, జగతి,రిషి , వీళ్ళందరూ నీకు ఎంత అండగా ఉంటారు అని అంటాడు.