28 Degree Celsius Movie Review: `28 డిగ్రీ సెల్సియస్‌` మూవీ రివ్యూ

Published : Apr 04, 2025, 05:06 PM IST

28 Degree Celsius Movie Review: నవీన చంద్ర హీరోగా `పొలిమేర` ఫేమ్‌ డా. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన మూవీ `28 డిగ్రీ సెల్సియస్‌`. ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
28 Degree Celsius Movie Review: `28 డిగ్రీ సెల్సియస్‌` మూవీ రివ్యూ
28 Degree Celsius movie review

28 Degree Celsius Movie Review: నవీన్‌ చంద్ర ఓ వైపు హీరోగా, మరోవైపు విలన్‌గా చేస్తూ మెప్పిస్తున్నారు. సినిమాలే కాదు, వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సొంతం చేసుకుంటూ రాణిస్తున్నారు. నటుడిగా మెప్పిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన మూవీ `28°C`(28 డిగ్రీ సెల్సియస్‌).

`పొలిమేర` ఫేమ్‌ డా అనిల్‌ విశ్వనాథ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వీరాంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై సాయి అభిషేక్‌ నిర్మించారు. ఇందులో నవీన్‌ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 4) థియేటర్లో విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

26
28 Degree Celsius movie review

కథః 
జార్జియాలో జరిగే కథ ఇది. కార్తిక్‌(నవీన్‌ చంద్ర), అంజలి(షాలినీ వడ్నికట్టి) మెడిసిన్‌ చదువుతుంటారు. ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఉంటుంది. లోలోపల అది ప్రేమగా మారుతుంది. ఎట్టకేలకు ప్రేమని వ్యక్తం చేసుకుంటారు. నో చెప్పడానికి కారణాలేమీ లేవు. దీంతో టైమ్‌ తీసుకుని ఎస్‌ చెప్పుకుంటారు. కార్తీక్‌ ఒంటరి. పేరెంట్స్ ఎవరూ లేరు. కులం కూడా వేరే.

దీంతో అంజలి ఇంట్లో ఒప్పుకోరు. ఊర్లో పరువే ముఖ్యమని తండ్రి చెబుతాడు. దీంతో చేసేదేం లేక తల్లిదండ్రులను వదులుకుని కార్తీక్‌ కోసం వచ్చేస్తుంది అంజలి. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ సమయంలోనే అంజలి పిట్స్ వచ్చి పడిపోతుంది. స్కానింగ్‌ చేయగా ఆమె ఒక వింత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. 28 డిగ్రీ సెల్సియస్‌లోనే ఆమె ఉండాల్సి వస్తుంది.

వేడి పెరిగినా ప్రాణాలకు ప్రమాదం, చల్లదనం పెరిగినా ప్రమాదం. దీంతో ఒకే టెంపరేచర్‌లో ఆమెని బాగా చూసుకుంటాడు కార్తీక్‌. ఇద్దరూ డాక్టర్‌ వృత్తిలోనే ఉంటారు. ఆల్మోస్ట్ ఒకే ఆసుపత్రిలో జాబ్‌ చేస్తారు. కానీ అనుకోకుండా వీరికి షిఫ్ట్ లు మారుతాయి. మార్నింగ్‌ ఒకరు చేస్తే నైట్‌ మరొకరు చేయాల్సి వస్తుంది. ఇది వారి లైఫ్‌లను తలక్రిందులను చేస్తుంది.

ఒక రోజు ఇంటికి వచ్చాక సర్‌ప్రైజ్‌ చేస్తానని చెప్పిన అంజలి సడెన్‌గా చనిపోతుంది. మరి ఆమె మరణానికి అతి వేడి అతి చలినే కారణమా? ఇంకా ఏదైనా ఉందా? అంజలి మరణంతో కార్తీక్‌ లైఫ్‌ ఎలా మారింది? ఇందులో గీత(దేవయాని శర్మ) పాత్రేంటి? కార్తీక్‌ ఇంట్లో ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. 
 

36
28 Degree Celsius movie review

విశ్లేషణః 
ఇదొక లవ్‌, ఎమోషనల్‌ థ్రిల్లర్‌. లవ్‌ స్టోరీ చుట్టూ కథ తిరిగి, ఆ తర్వాత కాస్త ఎమోషనల్‌ టచ్‌ ఇస్తూ థ్రిల్లర్‌ జోనర్‌లోకి వెళ్తుంది. నిజానికి ఈ మూవీని దర్శకుడు ఆరేళ్ల క్రితమే రూపొందించారు. అప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగానే ఈ మూవీని తెరకెక్కించారు. లవ్‌ స్టోరీలో థ్రిల్లర్‌ ఎలిమెంట్లని జోడించడం ఇందులో కాస్త కొత్తగా ఉంది.

కానీ దాన్ని ఇంట్రెస్టింగ్‌గా, ఉత్కంఠ భరితంగా, ఫీల్‌గుడ్‌ మూవీగా తెరపై ఆవిష్కరించే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా స్లోగా సాగుతుంది. లవ్‌ ట్రాక్‌ కూడా చాలా రొటీన్‌గా సాగుతుంది. ఎన్నో సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది. అయితే ఆ లవ్ లో కూడా ఫీల్‌ క్యారీ కాలేదు. ఎమోషన్స్ కూడా పండలేదు. దీంతో సీన్లు అలా సాగిపోతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ కి ముందు కాస్త ఎమోషనల్‌గా మారుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్ తో కథ సీరియస్‌గా మారుతుంది. 
 

46
28 Degree Celsius movie review

సెకండాఫ్‌ మొత్తం థ్రిల్లర్‌ వైపు వెళ్తుంది. భార్య చనిపోవడంతో భర్త పడే మనో వేదన ఎలాంటిదో ఇందులో చూపించారు. కానీ ఆ ఎమోషన్స్ కూడా అంతగా ఎక్కలేదు. లైటర్‌ వేలో చూపించారు. ఇక ఆ తర్వాత నుంచి సస్పెన్స్ విషయాలు చోటు చేసుకోవడం, థ్రిల్లర్‌ ఎలిమెంట్లు రావడంతో కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

ఇంతలోనే హర్రర్‌ ఎలిమెంట్లని యాడ్‌ చేయడంతో కథ ఎటు నుంచి ఎటు పోతుందనే అనే కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. ఫైనల్‌గా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ముగింపు పలకడం గమనార్హం. సెకండాఫ్‌, అందులోనూ క్లైమాక్స్ కోసమే ఈ మూవీ తీసినట్టుగా ఉంది. ప్రతి సినిమాకి ఒక ఎమోషనల్‌ ఉంటుంది, ఓ సోల్‌ ఉంటుంది. ఇందులో అది మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

ఆ ఎమోషన్‌ ఆడియెన్స్ కనెక్ట్ అయితే సినిమా కనెక్ట్ అవుతుంది. ఆ విషయంలో దర్శకుడు బాగా కేర్‌ తీసుకోవాల్సింది. అయితే ఇది ఆరేళ్ల క్రితం వచ్చి ఉంటే ఫర్వాలేదనిపించేది. ఇప్పుడు రావడంతో కాస్టింగ్‌ ఎంపిక కూడా మిస్‌ మ్యాచ్‌ అనేలా ఉంది. ఆ డిఫరెంట్‌ అర్థమైపోతుంది.

కాకపోతే టెక్నీకల్‌గా సినిమా ఫర్వాలేదు. మ్యూజిక్‌ బాగానే ఉంది. లవ్‌ ని కొత్తగా చూపించి, థ్రిల్లర్‌ ఎలిమెంట్లని ఇంకా ఎలివేట్‌ చేసి, అదే సమయంలో ప్రియదర్శి, వైవా హర్షలను కామెడీ పరంగా బాగా వాడుకుని ఉంటే సినిమా బాగుండేది. 

56
28 Degree Celsius movie review

నటీనటులుః 

ఇప్పుడు విలన్‌గా, వర్సటైల్‌ యాక్టర్‌గా రాణిస్తున్న నవీన్‌ చంద్ర ఇందులో కార్తీక్‌ పాత్రలో లవర్‌ బాయ్‌గా బాగా చేశాడు. కానీ ఇప్పుడు ఆయన ఇమేజ్‌ మారిపోయింది. లవర్‌ బాయ్ పాత్రలో ఆయన్ని చూడటం కొంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఇక అంజలి పాత్రలో షాలినీ వడ్నికట్టి బాగా చేసింది. ఉన్నంత వరకు ఆమె ఆకట్టుకుంది.

ఇక గీత పాత్రలో దేవయానీ శర్మ ఫర్వాలేదనిపించింది. ఆమె పాత్రలోని ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ప్రియదర్శి నవ్వించాడు. వైవా హర్ష నవ్వించడంతోపాటు ఎమోషనల్‌గానూ ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రయారిటీ లేదు. ఉన్నంతలో ఓకే అనిపించారు. 
 

66
28 Degree Celsius movie review

టెక్నీకల్‌గా ః 
శ్రావణ్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ బాగుంది. చాలా సాంగ్స్ కూల్‌గా అలరించేలా ఉన్నాయి. శ్రీ చరణ్‌ పాకాల బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సైతం డీసెంట్‌గా ఉంది. ఆకట్టుకుంది. సినిమాకి అదొక అసెట్‌గా నిలిచింది. వంశీ పచ్చిపులుసు కెమెరా వర్క్ బాగుంది.

విజువల్స్ కొత్తగా ఉన్నాయి. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. `పొరమేర` చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌.. ఈ మూవీని ఆ స్థాయిలో అలరించేలా తెరకెక్కించడంలో తడబడ్డాడు. ఆయన మొదటి మూవీ కావడంతో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌ మీద పెట్టిన ఫోకస్‌ ఫస్టాఫ్‌ మీద కూడా పెడితే బాగుండేది. 

ఫైనల్‌గాః బోరింగ్‌ లవ్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్. 
రేటింగ్‌ః 2.25
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories