Rajamouli-Bunny Combo: అల్లు అర్జున్‌తో రాజమౌళి పాన్‌ ఇండియా సినిమా.. సీక్రెట్‌గా చాలా జరిగిపోతున్నాయట ?

First Published | Mar 19, 2022, 6:43 PM IST

`బాహుబలి`, ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలతో ఇండియన్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా నిలిచిన రాజమౌళి, `పుష్ప`తో ఓ ఊపు ఊపిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కలిసి ఓ సినిమా చేస్తే.. వినడానికే పూనకాలు తెప్పిస్తున్న ఈ వార్త నిజం కాబోతుందా? నిజమేంటో తెలుసుకుందాం.

అల్లు అర్జున్‌(Allu Arjun) ప్రస్తుతం `పుష్ప`(Pushpa) చిత్రంలో బిజీగా ఉన్నారు. ఇటీవల `పుష్ప`తో ఆడియెన్స్ ముందుకొచ్చి బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు. త్వరలో ఆయన `పుష్ప` రెండో భాగం `పుష్పః ది రూల్‌` చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అటు బన్నీ, నిర్మాతలు, అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. తొలి భాగం సక్సెస్‌ కావడంతో రెండో భాగంపై అంచనాలు నెలకొన్నాయి. 
 

అయితే ఆ తర్వాత బన్నీ సినిమా ఎవరితో అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన చేయాల్సి సినిమాలు `వకీల్‌సాబ్‌` ఫేమ్‌ వేణు శ్రీరామ్‌తో ఓ సినిమా, కొరటాల శివతో మరో సినిమా చేయాల్సిన కమిట్‌మెంట్లు ఉన్నాయి. కానీ ఇవి వాయిదా పడ్డాయి. మరోవైపు బోయపాటి శ్రీనుతో, అలాగే `అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగాతో, దీంతోపాటు `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తోనూ బన్నీ చర్చలు జరిపారు. మరోవైపు ఇటీవల హిందీలో స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీని కలిశారు. వీరి మధ్య కూడా ఓ సినిమా చర్చలు జరిగాయని టాక్‌. డైరెక్ట్ బాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించిన సినిమా సంజయ్‌లీలా భన్సాలీతో ప్లాన్‌ చేసినట్టు వార్తలు ఊపందుకున్నాయి. 
 


మరోవైపు ఇప్పుడు బన్నీకి సంబంధించిన మరో గూస్‌బంమ్స్ తెప్పించే వార్త వైరల్‌ అవుతుంది. అల్లు అర్జున్‌తో రాజమౌళి(Rajamouli) ఓ సినిమా చేస్తున్నారనేది ఈ వార్త సారాంశం. అయితే ఇప్పటి వరకు ఇద్దరు కలుసుకున్నట్టు కూడా వార్త లేదు. సీక్రెట్‌గా వీరిమధ్య చర్చలు జరిగాయని తెలుస్తుంది. డైరెక్ట్ బన్నీ, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అనే వార్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందులో నిజమెంతా అనేది ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. కానీ సీక్రెట్‌గా చాలా జరిగిపోతున్నాయని అంటున్నారు నెటిజన్లు. 
 

రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) రిలీజ్‌ తర్వాత మహేష్‌బాబు(Maheshbabu) సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందట. ఫారెస్ట్ బేస్డ్ గా సినిమా సాగుతుందని, మహేష్‌ ఇందులో సాహసికుడిగా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఇందులో కీలక పాత్ర కోసం బాలకృష్ణని తీసుకోబోతున్నారనే వార్త కూడా ఆ మధ్య ఇంటర్నెట్‌లో, ఫిల్మ్ నగర్‌లో వైరల్‌ అయ్యింది. మహేష్‌తో రాజమౌళి సినిమా అంటే దాదాపు రెండేళ్లైనా పడుతుంది. అంటే 2023 వరకు రాజమౌళి మరో సినిమా చేసే ఛాన్స్ లేదు. 

మరి అల్లు అర్జున్‌తో సినిమా వార్తల్లో నిజమెంతా అనేది ఇప్పుడు అందరిలోనూ తొలుస్తున్న ప్రశ్న. అయితే ఇటీవల రాజమౌళి `పుష్ప` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. బన్నీ తెలుగు సినిమాకి ఒక గిఫ్ట్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఆయన కష్టపడుతున్న తీరు పట్ల జక్కన్న ప్రశంసలు కురిపించారు. అయితే ఇదే విషయం బన్నీ, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఉందనే వార్తకి బలం చేకూరుతుంది. 

బన్నీ, రాజమౌళి మధ్య లాక్‌ డౌన్‌ సమయంలోనే చర్చలు జరిగాయట. ఇద్దరు కలిసి ఓ సినిమా చేయడం కోసం కలిసినట్టు తెలుస్తుంది. బన్నీ సైతం ఓకే చెప్పారని, కచ్చితంగా వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్త బలంగా వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా? ఇది మహేష్‌బాబుతో సినిమా కంటే ముందే వస్తుందా? లేక మహేష్‌తో సినిమా తర్వాత వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం ఐకాన్‌స్టార్‌ అభిమానులను పూనకాలు తెప్పిస్తుంది. మరోవైపు టాలీవుడ్‌ ఆడియెన్స్ సైతం ఎగ్జైట్‌ అవుతున్నారు. నిజంగానే ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే అది వేరే లెవల్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

ఇప్పటి వరకు ముగ్గరు హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేశారు రాజమౌళి. ఎన్టీఆర్‌తో తన జర్నీ ప్రారంభించారు. ఆయనతో ఏకంగా నాలుగు సినిమాలు చేశారు. ప్రభాస్‌తో మూడు(బాహుబలి రెండు పార్ట్ లు కలిపి), రామ్‌చరణ్‌తో రెండు సినిమాలు చేశారు. సునీల్‌తో ఓ చిన్న చిత్రాన్ని రూపొందించారు. అయితే తాను కూడా మరింత ఓపెన్‌ కావాలని భావిస్తున్నారట. కేవలం కంఫర్ట్ హీరోలతోనే కాదు, కొత్త వారితోనే చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందులో భాగంగానే మహేష్‌తో సినిమా ప్రకటించారు. మరోవైపు అల్లు అర్జున్‌తో కూడా సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!