Pushpa 2 Item Song: సమంతని కాదని ఆటం బాంబ్‌ని దించుతున్న సుకుమార్‌.. అల్లు అర్జున్‌ ప్లాన్‌ అదిరింది ?

Published : Mar 19, 2022, 05:12 PM IST

అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` చిత్రంలో సమంత ఐటెమ్‌ సాంగ్‌ ఎంతగా పేలిందో తెలిసిందే. తాజాగా `పుష్ప` రెండో పార్ట్ లోనూ మరో ఐటెమ్‌ సాంగ్‌ని ప్లాన్‌ చేశారు. ఈ సారి ఆటం బాంబ్‌ని రంగంలోకి దించబోతున్నారు దర్శకుడు సుకుమార్‌. 

PREV
16
Pushpa 2 Item Song: సమంతని కాదని ఆటం బాంబ్‌ని దించుతున్న సుకుమార్‌.. అల్లు అర్జున్‌ ప్లాన్‌ అదిరింది ?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) నటించిన `పుష్ప`(Pushpa) చిత్రం ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా  గతేడాది డిసెంబర్‌ 17న విడుదలై ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ఈ సినిమా ఏకంగా రూ.350కోట్లు వసూలు చేసింది.  నాన్‌ బాహుబలి రికార్డ్ లను తిరగరాసింది. పుష్పరాజ్‌గా బన్నీ చేసిన హంగామా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. చిత్తూరు యాసలో ఆయన తన నట విశ్వరూపం చూపించారు. 

26

ఇందులో సమంత(Samantha) నర్తించిన  `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ` అనే ఐటెమ్‌ సాంగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఫస్ట్ టైమ్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌ చేసి అదరగొట్టింది. అందాల ఆరబోతలోనూ తనకు హద్దుల్లేవని చాటుకుంది. ఈ పాట గురించే చాలా రోజులు చర్చసాగడం విశేషం. ఇప్పటికీ ఈ పాట నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటుంది. ఫంక్షన్లలోనూ సందడి చేస్తుంది. అంతగా ఈ స్పెషల్‌ సాంగ్‌ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించింది. 

36

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్(Pushpa 2) తెరకెక్కబోతుంది. మొదట సింగిల్‌గానే ప్రారంభించిన `పుష్ప`ని మధ్యలో రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. రాజమౌళి సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు దర్శకుడు సుకుమార్‌ తెలిపారు. త్వరలోనే రెండో పార్ట్ షూటింగ్‌ జరగబోతుంది. మొదటి భాగం చివర్లో అసలు కథ స్టార్ట్ కాగా, రెండో భాగంలో పుష్పరాజ్‌.. ఒక నాయకుడిగా ఎదిగిన తీరుని చూపించబోతున్నారు. 

46

రెండో భాగంలోనే అసలు కథ ఉంటుంది. దీంతో ఈ చిత్రం కోసం యావత్‌ ఇండియా వెయిట్‌ చేస్తుంది. దాన్ని అంతే స్థాయిలో తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే మొదటి భాగంలో ఉన్న ఐటెమ్‌ సాంగ్‌ మాదిరిగానే రెండో భాగంలోనూ స్పెషల్‌ సాంగ్‌ పెట్టబోతున్నారట. కానీ సమంత స్థానంలో మరో కథానాయికని తీసుకోవాలనుకుంటున్నట్టు సమచారం. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పైగా రెండో భాగంలో కొత్త దనం తీసుకురావడం కోసం మరో స్టార్‌ హీరోయిన్‌ని దించబోతున్నట్టు సమాచారం. 

56

ఆ హీరోయిన్‌ ఎవరో కాదు తెలుగులో `లోఫర్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటానీ అని టాక్‌. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈ ఐటెమ్‌ సాంగ్‌కి సంబంధించి ఇప్పటికే దిశాతో చర్చలు జరిగాయని, అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందని సమాచారం. బాలీవుడ్‌లో దిశాపటానీకి స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటూ హాట్‌ బాంబ్‌గా పేరుతెచ్చుకుంది. ఇటీవల వచ్చిన `రాధే`లో ఆమె గ్లామర్‌ పోతకి బాలీవుడ్‌ మొత్తం ఫిదా అయ్యింది. ఆటంబాంబ్‌కి సరైన అర్థాన్నిచ్చే దిశాపటానీతో ఐటెమ్‌ సాంగ్‌ అంటే ఆ క్రేజ్‌, ఊపు మామూలుగా ఉండదు. అందుకే సెకండ్‌ పార్ట్ లో దిశాపటానీతో స్పెషల్‌ సాంగ్‌ చేయాలని భావిస్తున్నారట. 

66

ఇదిలా ఉంటే దిశా పటానీని ఎంచుకోవడం వెనకాల మరో కారణం ఉందట. దిశాకీ బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. మాస్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. హాట్‌ బ్యూటీగా ఆమె అందాలను ఆరబోస్తూ అందరి ఆడియెన్స్ కి రీచ్‌ అయ్యింది. దీంతో బాలీవుడ్‌ మార్కెట్‌లో ఇది `పుష్ప 2` చిత్రానికి మరింతగా కలిసొస్తుంది. బాలీవుడ్‌ టోన్‌ యాడ్‌ అవుతుందని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ భావించారట. అందుకే ఆమెతో స్పెషల్‌ సాంగ్‌ చేయించబోతున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే బన్నీ, సుకుమార్‌ల ప్లాన్‌ అదిరిపోయినట్టే అని చెప్పొచ్చు. `పుష్ప` హిందీలో దాదాపు వంద కోట్లు కలెక్ట్ చేసింది. `పుష్ప2`తో బాలీవుడ్‌ని షేక్‌ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories