వాళ్లిద్దరూ బ్రతికుంటే తప్పకుండా సినిమా చేసేవాడిని.. రాజమౌళికి అంత ఇష్టమైన నటులు ఎవరో తెలుసా

Published : Sep 29, 2025, 01:18 PM IST

రాజమౌళితో సినిమా చేయాలని బడా స్టార్లు ఆశిస్తుంటారు. కానీ రాజమౌళి మాత్రం ఇద్దరు నటులతో సినిమా చేయాలని భావించారు. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు లేరు. ఆ నటులు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
పాన్ వరల్డ్ ని టార్గెట్ చేసిన రాజమౌళి 

దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క నటుడు, నటీమణి కోరుకుంటారు. రాజమౌళి సినిమాలో నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కుతుంది. రాజమౌళి తన తదుపరి చిత్రంతో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు చిత్రం 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది.  స్టార్ హీరోలంతా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. అదే విధంగా కొందరు హీరోలతో, హీరోయిన్లతో సినిమా చేయాలని రాజమౌళికి కూడా కోరిక ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ తనకి ఇష్టమైన ఇద్దరు నటులు బ్రతికి ఉంటే వాళ్ళతో తప్పకుండా సినిమా చేసేవాడిని అని అన్నారు. 

25
వారిద్దరూ బ్రతికుంటే సినిమా చేసేవాడిని 

మరణించిన నటుల్లో మీరు సినిమా చేసే ఉంటే బావుండేది అని అనిపించే 3 నటుల పేర్లు చెప్పండి అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి రాజమౌళి స్పందిస్తూ ముగ్గురు కాదు కానీ ఇద్దరు పేర్లు మాత్రం కచ్చితంగా చెప్పగలను అని అన్నారు. వారిద్దరూ ఎవరో కాదు ఒకరు ఎన్టీఆర్.. మరొకరు సావిత్రి గారు అని రాజమౌళి తెలిపారు. వారిద్దరితో సినిమా చేసి ఉంటే చాలా బావుండేది అని జక్కన్న అన్నారు. దీనితో వారిద్దరూ అంటే రాజమౌళికి ఎంత అభిమానమో అర్థం అవుతోంది. 

35
హీరోలకు ర్యాంక్ లు లేవు 

రాజమౌళి తన అభిప్రాయాలని నిరభ్యంతరంగా చెబుతుంటారు. మరో ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలకు నెంబర్ 1, నెంబర్ 2 అనే ర్యాంకింగ్ లు లేవని.. టాలీవుడ్ ర్యాంకింగ్ లు ఎన్టీఆర్, చిరంజీవి గారితోనే అంతం అయ్యాయి అని అన్నారు. రాజమౌళికి ఇష్టమైన చిత్రం మాయాబజార్ అని తెలిపారు. చిన్నతనంలో ఎన్టీఆర్ గారు నటించిన జానపద చిత్రాలు విపరీతంగా చూసేవాడిని అని రాజమౌళి అన్నారు. తన చైల్డ్ హుడ్ రోల్ మోడల్ ఎన్టీఆర్ గారు అని రాజమౌళి తెలిపారు. 

45
రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలు 

 రాజమౌళి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్, రవితేజ, నాని, సునీల్, రాంచరణ్ లాంటి హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతం మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాట్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండే ఈ కథని రాజమౌళి హిందూ పురాణాలకు లింక్ చేస్తూ రూపొందిస్తున్నారు. 

55
ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ 

 బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ అయితే ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది. మరి మహేష్ మూవీతో రాజమౌళి ఎన్ని అవార్డులకు గురిపెట్టారో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం రాజమౌళి పలు హాలీవుడ్ సంస్థలతో కొలాబరేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories