బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం, రిపబ్లిక్ డే కు రంగం సిద్ధం.

First Published | Nov 23, 2024, 6:01 PM IST

బాలయ్య బాబు అత్యున్నత పురస్కారం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్యఅందుకోబోయే ఆ అవార్డ్ ఏంటో తెలుసా..?

Balakrishna

నందమూరి నటసింహం బాలయ్య బాబు.. ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళు అయ్యింది. రీసెంట్ గానే 5దశాబ్ధాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు టాలీవుడ్ జనాలు. ఇక అభిమానులు ఆనందానికైతే అవదుల్లేవు. నందమూరి వారసత్వాన్నిఅందుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ.. తండ్రిని మించిన తనయుడిగా ఎదిగారు. 
 

సీనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది కొడుకులు ఉన్నా.. సినీవారసత్వాన్నినిలబెట్టింది మాత్రం బాలయ్యే. ఆయనకున్న మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఏ హీరోకు లేదు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య బాబు ఈ ఇద్దరు సీనియర్ హీరోలే ఇప్పటికీ  అదే జోరు.. అదే ఊపును, ఇమేన్ ను, ఫ్యాన్స్ ను  మెయింటేన్ చేస్తున్నారు. 


బాలయ్య  సినిమా పరిశ్రమకు.. రాజకీయ రంగంలో ప్రజలకు చేసిన సేవకు ఆయనను అత్యున్నత కేంద్ర ప్రభుత్వ పురస్కారం వరించబోతున్నట్టు ఇండ స్ట్రీలో టాక్ నడుస్తోంది. బాలయ్యమల్టీటాలెంటెడ్. ఆయన పలు రంగాలలో సేవలు అందించాడు. బాలకృష్ణను సినిమా హీరోగా మాత్రమే చూస్తారు చాలామంది.

కాని ఆయన సినిమాల్లో హీరోగా,  బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా, హిందూపురం ఎమ్మెల్యేగా.. బుల్లితెర హోస్ట్ గా, పలు స్వస్చంద్ద సంస్థలకు సాయం అందిస్తూ మంచి మనిషిగా.. ఇలా బహుముఖ ప్రతిభ కనబరిచి.. అనేక రంగాలలో తన సేవలను విస్తరించారు. 

అంతే కాదు తెలుగు సినీపరిశ్రమకు, సినిమ రంగానికి నందమూరి బాలకృష్ణ చేసిన సేవలు, వేసిన మార్క్ అంతా ఇంతా కాదు.  బాలయ్య బాబు దాదాపు 110 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికీ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా హిందీపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ..సినిమాల పరంగా కూడా వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.  
 

బసవతారకం ఆసుపత్రి చైర్మెన్ గా. క్యాన్సర్ రోగులకు చాలా తక్కువ ధరకే ట్రీట్మెంట్ అందిస్తూ.. ఖరీదైన క్యాన్సర్ ట్రీట్మెంట్ ను చాలా తక్కువ ధరకే అందిస్తున్నారు  బాలకృష్ణ.  మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ పేరిట విజయ వంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం సక్సెస్ ఫల్ గా నాలుగో సీజన్ ను నడిపిస్తున్నారు. 

ఈ క్రమంలో బాలయ్య సేవలు గుర్తించిన క్రేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషన్ ను ప్రకటించబోతుంది అని టాక్ నడుస్తోంది. అంతే కాదు ఏపీ  ప్రభుత్వం ఇప్పటికే  పద్మభూషన పురుస్కారానికి  ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. పద్మభూషణ్ అవార్డుకు నామినేట్ చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల నుంచి బాలయ్య బాబుతో పాటు మరో హీరోకి కూడా ఈ పద్మభూషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 

నవంబర్ లో ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ లో ఫైనల్ అవుతుంది. ఇక జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డ్ లను ప్రకటిస్తుంద కేంద్ర ప్రభుత్వం. ఇక ఈక్రమంలో పద్మ భూషన్ అవార్డ్ కోసం  బాలయ్య పేరు పక్కా అని తెలుస్తోంది. 

Latest Videos

click me!