పవన్‌ కళ్యాణ్‌ మూవీ ఆగిపోయిందా? మరో సినిమా కూడా డౌటే? ఫ్యాన్స్ లో ఆందోళన!

First Published | Nov 23, 2024, 6:09 PM IST

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు ఆగిపోతున్నాయి. ఇప్పుడుఓ సినిమా ఆగిపోయిందని సమాచారం. మరోవైపు మరో మూవీ కూడా ఆగిపోయే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 
 

Pawan Kalyan

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లు అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఈ రెండింటిని మ్యానేజ్‌ చేయడం కష్టంగా మారింది. దీంతో ఒప్పుకున్న సినిమాలు కూడా పూర్తి చేయడం కష్టమైపోతుంది. షూటింగ్‌కి టైమ్‌ ఇవ్వలేకపోతున్నారు. చాలా సార్లు షూటింగ్‌కి ప్లాన్‌ చేసినా ఏదో పబ్లిక్‌ ఇష్యూస్‌ వచ్చి ఆగిపోతున్నాయి. దీంతో షూటింగ్‌లకు వెళ్లలేకపోతున్నారు పవన్‌. 

బిగ్ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ప్రస్తుతం ఆయన `హరిహర వీరమల్లు` సినిమాని కంప్లీట్‌ చేయాలనుకున్నారు. ఆయన ఆఫీస్‌కి దగ్గర్లోనే సెట్‌ కూడా వేశారు. అంతా రెడీ చేస్తున్నారు. పవన్‌ వచ్చి షూటింగ్‌ చేసి వెళ్లిపోవడమే. కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారట. కానీ మధ్యలో అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో అంతటితోనే ఆగిపోయింది.

మరోవైపు `ఓజీ` సినిమా టీమ్‌ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంది. అన్నీ రెడీ చేసుకుని ఉన్నారు. పవన్‌ రావడమే ఆలస్యం. చాలా వరకు డూప్‌తో మ్యానేజ్‌ చేసి, క్లోజప్‌ షాట్స్ మాత్రమే పవన్‌పై తీయాలనుకుంటున్నారు. అలా కూడా సాధ్యం కావడం లేదట. కానీ పవన్‌కి ఎప్పుడు పాజిబులిటీ ఉన్నా ఈ రెండు సినిమాలు కంప్లీట్‌ చేసే అవకాశం ఉంది. 


Pawan kalyan, Surendra reddy

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ షాకింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఆగిపోయిందనే రూమర్‌ వినిపిస్తుంది. నిర్మాత కూడా అదే హింట్‌ ఇచ్చాడు. మరి ఆ మూవీ ఏంటనేది చూస్తే.. పవన్‌ కళ్యాణ్‌, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ మూవీని నిర్మించనున్నారు.

పవన్‌కి నిర్మాత మంచి ఫ్రెండ్‌. పవన్‌ సోషల్‌ మీడియాని డీల్‌ చేస్తుంటారు కూడా. చాలా కాలంగా వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. సినిమాలకు అతీతమైన స్నేహం వీరిది. అయితే పవన్‌తో సినిమా చేయాలని ఐదేళ్ల క్రితం అడ్వాన్స్ కూడా ఇచ్చారు నిర్మాత. సినిమాని కూడా ప్రకటించారు. 

అప్పట్లో అదిగో, ఇదిగో ప్రారంభం అని అన్నారు. సరిగ్గా అదే సమయంలో రాజకీయ పరిణామాలు మారడంతో ఈ మూవీ పక్కకు వెళ్లింది. ఈజీగా చేయగలిగే సినిమాలకు ప్రయారిటీ ఇచ్చాడు పవన్‌. దీంతో సురేందర్‌రెడ్డి సినిమా వెనక్కి వెళ్తూ వస్తుంది. ఇప్పుడేమో డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. షూటింగ్‌ సగంలో ఉన్న సినిమాలే చేయడానికి దిక్కులేదు.

దీంతో సురేందర్‌ రెడ్డి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు నిర్మాత రామ్‌ తాళ్లూరి. ఈ ప్రాజెక్ట్ పై తనకు హోప్స్ లేవని తెలిపారు. రాను రాను హోప్స్ తగ్గిపోతున్నాయని చెప్పారు. ఇక ఈ మూవీ ఉండబోదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. యూట్యూబ్‌(గ్రేట్‌ ఆంధ్ర) ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు రామ్‌ తాళ్లూరి. సురేందర్‌రెడ్డితో మరో సినిమాని ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పారు. 
 

అంతేకాదు పవన్‌ మరో సినిమాపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. పవన్‌.. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలోనూ నటించాల్సి ఉంది. ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. కాకపోతే ఇది కేవలం పది, ఇరవై శాతం మాత్రమే షూటింగ్‌ అయ్యింది. హరీష్‌ శంకర్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

పవన్‌ మార్క్ మాస్‌ డైలాగులు, కమర్షియల్‌ ఎలిమెంట్లతో ఈ మూవీని తెరకెక్కించాలని హరీష్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కానీ ఈ మూవీ షూటింగ్‌లో కూడా పవన్‌ పాల్గొనడం కష్టమే అని తెలుస్తుంది.  ఈసినిమా కూడా ఆగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

ఇదిలా ఉంటే `హరిహర వీరమల్లు` అప్‌ డేట్ ఇచ్చింది టీమ్‌. వచ్చే ఏడాది మార్చి 28న సినిమా విడుదల కాబోతున్నట్టు మరోసారి స్పష్టం చేసింది. సినిమా షూటింగ్‌లపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీమ్‌ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్‌ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ మోఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగా జేబ్‌కి వ్యతిరేకంగా పోరాడిన దొంగ వీరమల్లు కథ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుండటం విశేషం.  

read more:పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌ దేవయాకి ఇన్ని ఆస్తులున్నాయా? లగ్జరీ కార్స్, హౌజ్‌, ఫామ్‌ హౌజ్.. లిస్ట్ పెద్దదే

also read: సినిమాల్లోకి రోజా రీఎంట్రీ.. ఎలాంటి రోల్స్ చేయాలని ఉందో మనసులో మాట బయటపెట్టిన ఫైర్‌ బ్రాండ్
 

Latest Videos

click me!