రాజమౌళి కెరీర్‌ని చూస్తే ఆయనకు పరాజయమే లేదు. అపజయం ఎరుగని దర్శకుడిగా రాణిస్తున్నారు. `స్టూడెంట్ నెం.1` నుంచి అదే కొనసాగిస్తున్నారు. `సింహాద్రి`, `సై`,`ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `యమదొంగ`, `మగధీర`, `మర్యాద రామన్న`, `ఈగ`, `బాహుబలి` 1-2, `ఆర్‌ఆర్‌ఆర్` వరకు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. సునీల్‌తోనూ సినిమా తీసి హిట్ అందుకున్నారు. ఈగతోనూ మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్, సునీల్, నాని, రామ్ చరణ్, రవితేజ వంటి హీరోలతో పనిచేశారు. ఇప్పుడు మొదటిసారి మహేష్ బాబుతో చేస్తున్నారు. అయితే రాజమౌళి మొదటగా డైరెక్ట్ చేసింది ఎన్టీఆర్‌ని కాదు. లెజెండరీ నటుడు ఎస్వీఆర్ చేయాల్సిన సినిమాని జక్కన్న చేయాల్సి వచ్చింది.