దీని గురించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చర్చించారు. యాంకర్ కి, వర్మకి మధ్య రాజమౌళి గురించి చర్చ జరిగింది. గతంలో రాజమౌళి ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయం గురించి ఒక పుస్తకం రాశారట. కొన్ని రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని రాజమౌళి చించిపడేసారట. మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ మూవీ వల్లే రాజమౌళి అలా చేశారని తెలిసింది. అప్పటివరకు తనకి ఒక చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి అనే విషయంలో క్లారిటీ ఉండేది అని, కానీ బిజినెస్ మాన్ మూవీ చూశాక మైండ్ బ్లాక్ అయిందని రాజమౌళి తెలిపారట. అందుకే ఆ పుస్తకాన్ని చించేసినట్లు చెప్పారు.