nikhil maliyakkal
Nikhil Maliyakkal: `బిగ్ బాస్ తెలుగు 8` షోతో పాపులర్ అయ్యాడు కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్. సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గతే సీజన్ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ఈ షో ఆయన జీవితాన్నే మార్చింది. అంతేకాదు ఆయన విన్నర్‌గా నిలవడంతో ఆస్తుల పరంగానూ ఆయన లైఫ్ మారిపోయిందని చెప్పొచ్చు.
nikhil maliyakkal
కన్నడ నటుడు అయిన నిఖిల్.. తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ రాణించారు. 2016లో `ఊటీ` అనే కన్నడ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు నిఖిల్. అది పెద్దగా ఆడలేదు, తనకు సినిమా ఆఫర్లు కూడా పెద్దగా రాలేదు. ఆ తర్వాత రెండేళ్లకి `మానేయే మంత్రలయ` అనే సీరియల్లో జీవన్ పాత్రలో నటించాడు. ఇది ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.
నిఖిల్
ఈ క్రమంలోనే తెలుగులో నటించే అవకాశం వరించింది. 2019లో `గోరింటాకు` సీరియల్‌లో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇందులో పార్థు పాత్రలో కనిపించాడు నిఖిల్. ఇది బాగానే పేరు తెచ్చింది.
అనంతరం `అమ్మకు తెలియని కోయిలమ్మ` అనే సీరియస్‌తో మరింతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే ఆయనకు గతేడాది బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొనే అవకాశం తెచ్చిపెట్టింది. అవకాశమే కాదు బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్‌గానూ నిలిపింది. ఈ షో ద్వారా సుమారు కోటి రూపాయల వరకు సంపాదించాడు నిఖిల్.
బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్
ఇప్పుడు నిఖిల్ ఆస్తులు ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఆయనకు సుమారు రెండు కోట్లకుపైగా ఆస్తులున్నట్టు తెలుస్తుంది. అందులో ఇటీవల బిగ్ బాస్ తెలుగు 8 ద్వారానే కోటీకిపైగా సంపాదించడం విశేషం.
ప్రస్తుతం ఆయన ఆదాయం ఏడాదికి రూ.50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే సెలబ్రిటీ కావడంతో ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటుంది. మెయింటనెన్స్ కి ప్రయారిటీ ఇస్తారు. దీంతో సంపాదనలో సగానికిపైగా ఖర్చులకు వెళ్తుంది, నిఖిల్ విషయంలోనూ అదే జరుగుతుం