`దళపతి` లోని `చిలకమ్మా చిటికేయంగా` పాట వెనుక క్రేజీ స్టోరీ.. ముంబయి మ్యూజీషియన్లకి మైండ్‌ బ్లాక్‌

Published : Apr 07, 2025, 01:09 PM IST

రజనీకాంత్‌ హీరోగా మణిరత్నం తీసిన `దళపతి` సినిమాలో `చిలకమ్మా చిటికేయంగా`  పాట వెనుక ఉన్న కథని ఇళయరాజా  బయటపెట్టాడు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

PREV
14
`దళపతి` లోని `చిలకమ్మా చిటికేయంగా` పాట వెనుక  క్రేజీ స్టోరీ.. ముంబయి మ్యూజీషియన్లకి మైండ్‌ బ్లాక్‌
Ilayaraja Songs

సంగీత దర్శకుడు ఇళయరాజా చాలా మంది డైరెక్టర్లతో పని చేసినా, మణిరత్నంతో కలిస్తే వచ్చే పాటలకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. `అగ్ని నక్షత్రం`, `మౌన రాగం`, `నాయకన్‌`, `అంజలి` ఇలా చాలా పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీళ్లిద్దరూ కలిసి చేసిన ఆఖరి సినిమా `దళపతి` ఆ తర్వాత మణిరత్నం సినిమాలకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం చేస్తున్నారు.

24
ఇళయరాజా

ఇళయరాజా - మణిరత్నం కలిసి చేసిన ఆఖరి సినిమా

ఇళయరాజా - మణిరత్నం కలిసి చేసిన ఆఖరి సినిమా `దళపతి` లో ప్రతి పాట ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్ గా చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ అవ్వడానికి పాటలు కూడా ఒక ముఖ్య కారణం. ఈ సినిమా పాటల కంపోజింగ్ మొత్తం ముంబైలో జరిగిందట. `చిలకమ్మా చిటికేయంగా` పాట కంపోజింగ్ సమయంలో జరిగిన ఒక సరదా సంఘటనని ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

 

34
`దళపతి` సినిమా పాట సీక్రెట్

`చిలకమ్మా చిటికేయంగా` పాట కంపోజింగ్

పాటకి నోట్స్ రాసి, సంగీతకారులు వాయించడానికి రెడీగా ఉన్నారట. ఆ సమయంలో మణిరత్నం వచ్చి, రాజా ఈ పాటలో హీరోయిన్ ఎంట్రీ ఉంటుందని చెప్పాను కదా మర్చిపోయావా అని అడిగారట. అప్పుడు రాజా, అరె మర్చిపోయానే మణి అని చెప్పి, తన అసిస్టెంట్ ఒకరిని నీకు దేవరం పాట తెలుసా అని అడిగారు. ఆయన తెలుసు అని చెప్పి, “కునిత పురువముం” అని మొదలయ్యే ఒక దేవరం పాటని చెప్పారు.

44
ఇళయరాజా పాట సీక్రెట్

`దళపతి`లో ఇళయరాజా మ్యాజిక్ తో చేసిన మ్యాజిక్‌

వెంటనే కోరస్ పాడటానికి వచ్చిన అమ్మాయిలకి ఆ దేవరం పాట లైన్స్ ఇచ్చి, పాడమని చెప్పారు ఇళయరాజా. వాళ్ళు పాడిన తర్వాత `చిలమ్మా చిటికేయంగా`( రాకంమా కైయ తట్టు) పాట మొదలయ్యేలా కంపోజ్ చేశారు ఇళయరాజా. ఇది చూసిన బొంబాయి సంగీతకారులు నోరెళ్లబెట్టారట. కొన్ని నిమిషాల్లో దేవరం పాట లైన్స్ తో ఇళయరాజా చేసిన మ్యాజిక్ వాళ్ళని ఆశ్చర్యపరిచింది.

ఆ పాట ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయింది.  ఎవర్‌ గ్రీన్‌ సింగ్స్‌ లో ఒకటిగా నిలిచింది.  1991లో విడుదలైన `దళపతి` మూవీ పెద్ద విజయం సాధించింది. ఇందులో రజనీకాంత్‌తోపాటు మమ్ముట్టి, అరవింద్‌ స్వామి హీరోలుగా నటించగా, శోభన, భాను ప్రియా, శ్రీవిద్య హీరోయిన్లుగా మెరిశారు. 

read  more: `బిగ్‌ బాస్‌ తెలుగు 8` విన్నర్‌ నిఖిల్‌ ఆస్తులు ఎంతో తెలుసా? కోటీశ్వరుడిని చేసిన ఒకే ఒక్క షో

also read: రియాలిటీ షోస్‌లో గొడవలు, అసలు జరిగేది ఇదే.. నిజాలు బయటపెట్టిన యాంకర్‌ ప్రదీప్‌

 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories