అసలే కర్ణుడా, అర్జునుడా అని కొట్టుకు చస్తున్నారు.. రాజమౌళి మరో కొత్త వివాదం సృష్టించాడే..

First Published | Aug 3, 2024, 10:03 PM IST

అర్జునుడికంటే కర్ణుడు గొప్పవాడు అన్నట్లుగా కల్కి చిత్రంలో నాగ్ అశ్విన్ చూపించారు. దీనితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం విడుదలై పాన్ ఇండియా వ్యాప్తంగా తిరుగులేని విజయం అందుకుంది. 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. బాహుబలి తర్వాత 1000 కోట్లు సాధించిన ప్రభాస్ చిత్రం ఇదే. చివర్లో ప్రభాస్ భైరవ పాత్రని కర్ణుడు అంటూ రివీల్ చేయడం సినిమాకె హైలైట్ ట్విస్ట్. 

ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కర్ణుడిగా చూపించారు. దీనితో కల్కి క్లైమాక్స్ కి పర్ఫెక్ట్ ఎండింగ్ తో పాటు.. పార్ట్ 2 పై ఆసక్తిని పెంచేలా చేశారు. అయితే కర్ణుడి పాత్రని నాగ్ అశ్విన్ చూపించిన విధానాన్ని కొందరు చరిత్రకారులు, పురాణ ఇతిహాసాలు చదివిన పండితులు తప్పు పడుతున్నారు. 


అర్జునుడికంటే కర్ణుడు గొప్పవాడు అన్నట్లుగా కల్కి చిత్రంలో నాగ్ అశ్విన్ చూపించారు. దీనితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయంలో నాగ్ అశ్విన్ కాస్త ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. కర్ణుడు చెడు లక్షణాల గురించి నెటిజన్లు ఎక్కువగా చర్చించుకున్నారు. 

కర్ణుడు గొప్పా అర్జునుడు గొప్పా అనే వివాదమే ఇంకా తేలలేదు. ఇంతలో రాజమౌళి మరో వివాదానికి శ్రీకారం చుట్టారు. మోడ్రన్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజమౌళిపై తెరకెక్కించించింది. రాజమౌళి కెరీర్ లో ఎలా ఎదిగారు.. పాన్ ఇండియా స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఇంతలా ఎలా గుర్తింపు పొందారు అనే అంశాలని చూపించారు. 

Rajamouli

ఈ డాక్యుమెంటరీ చిత్రంలో రాజమౌళి రావణుడు, రాముడి గురించి మాట్లాడారు. పురాణాల గురించి బాగా డెప్త్ గా నాలెడ్జ్ ఉన్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు. తనకి రాముడికంటే రావణుడు అంటేనే ఇష్టం అని రాజమౌళి అన్నారు. 

రాముడు గొప్ప కథానాయకుడు అవుతారు. అందులో సందేహం లేదు. కానీ నేను కథానాయకుల కంటే విలన్లకే ప్రాధాన్యత ఇస్తాను. విలన్ అంటే అతడిని ఓడించడం చాలా కష్టం అనిపించాలి. ఆ విషయంలో తనకి రావణుడి పాత్రే ఇష్టం అని రాజమౌళి అన్నారు. 

Latest Videos

click me!