హీరోయిన్లే మహేష్‌ బాబు వెంటపడటం చూశాం.. కానీ సూపర్‌ స్టారే హీరోయిన్ల వెంటపడితే.. స్టార్‌డైరెక్టర్ వైల్డ్ ఐడియా

Published : Aug 03, 2024, 08:33 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇప్పటి వరకు తన సినిమాల్లో హీరోయిన్లే ఆయన వెంటపడటం చూస్తుంటాం. కానీ ఆయనే హీరోయిన్ల వెంటపడితే.. స్టార్‌ డైరెక్టర్‌కి క్రేజీ ఐడియా.   

PREV
15
హీరోయిన్లే మహేష్‌ బాబు వెంటపడటం చూశాం.. కానీ సూపర్‌ స్టారే హీరోయిన్ల వెంటపడితే.. స్టార్‌డైరెక్టర్ వైల్డ్ ఐడియా

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాల్లో లవ్‌ స్టోరీలు చాలా తక్కువగానే ఉంటాయి. ప్రారంభంలోనే కొన్ని సినిమాలు చేశాడు. ఆయన అమ్మాయిల వెంటపడటం అనేది చాలా తక్కువ. ప్రారంభంలో లవ్‌ స్టోరీస్‌ చేసినా ఆయన వెంటే హీరోయిన్లు పడటం చూస్తుంటాం. లేదంటే కాస్త అటు ఇటుగా బ్యాలెన్స్ చేసి లవ్‌ స్టోరీలను తెరకెక్కించారు. కానీ మహేష్‌ సీరియస్ గా ఓ అమ్మాయి వెంటపడటం, ఆమె కోసం పిచ్చోడు కావడమనేది చాలా తక్కువ. 
 

25

ఇక ఇప్పుడు అయితే ఆ లవ్‌ స్టోరీస్‌ చేయడం కష్టమే. ఆయన మాస్‌, యాక్షన్‌ సినిమాల వైపు వెళ్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో అయితే లవ్‌కి పెద్దగా స్కోప్‌ కూడా ఉండదేమో. అయితే మహేష్‌ బాబుతో ఓ ప్రాపర్‌ లవ్‌ స్టోరీ చేస్తే, అది కూడా మహేషే అమ్మాయిల వెంటపడితే ఎలా ఉంటుంది? ఈ క్రేజీ, వైల్డ్ ఐడియా ఓ స్టార్‌ డైరెక్టర్‌కి వచ్చింది.
 

35

సందీప్‌ రెడ్డి వంగాకి ఓ క్రేజీ ఐడియా వచ్చింది. మహేష్‌ బాబునే అమ్మాయిల వెంటపడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దాన్ని ఆయన పంచుకున్నాడు. అలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేస్తే బాగుంటుందనే అబిప్రాయం వ్యక్తం చేశాడు. `యానిమల్‌` సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ ఆలోచన వచ్చింది. మహేష్‌ అమ్మాయిల వెంటపడితే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుందని, అలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అన్నారు సందీప్‌రెడ్డి వంగా. 
 

45

ఈ క్రేజీ ఐడియా పట్ల మహేష్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిజంగానే ఇది కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని వైల్డ్ గా ప్లాన్‌ చేయాలని అంటున్నారు. మరోకొందరు మహేష్ కి అమ్మాయిల వెంటపడాల్సిన అవసరం లేదని, అది సెట్‌ కాదని అంటున్నారు. ఏదేమైనా ఇదొక కొత్తచర్చకు కారణమవుతుందని చెప్పొచ్చు. మరి సందీప్‌ రెడ్డి వంగా మనసులో ఉన్న ఈ ఐడియాని సినిమాగా మలిచే ప్రయత్నం చేస్తాడా? అనేది చూడాలి. 

55

ప్రస్తుతం మహేష్‌ బాబు.. రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ కూడా ఫైనల్‌ స్టేజ్‌కి వచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు జక్కన్న. ఇందులో ఇండియన్‌ యాక్టర్స్, టెక్నీషియన్లతోపాటు హాలీవుడ్‌ టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నారని సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories